రోడ్డు సరిగా లేదని అంబులెన్స్ రాకపోవడంతో ఓ ఆదివాసీ మహిళ నడిరోడ్డుమీదే ప్రసవించింది. 

నిర్మల్ జిల్లా : కనీస వైద్య సదుపాయాలు లేక ఆదివాసీలు పడుతున్న అవస్థలకు మరో ఘటన అద్దం పడుతోంది. నిర్మల్ జిల్లాలో ఓ ఆదివాసీ మహిళ అర్ధరాత్రి నడిరోడ్డుపై గర్భిణీ ప్రసవించింది. నిర్మల్ జిల్లా, పెంగ్డి మండలంలోని తులసిపేటతులసిపేటలో ఉంటున్న సదరు మహిళకు పురిటినొప్పులు వచ్చాయి. అయితే రోడ్డు సరిగా లేకపోవడంతో తులసిపేటకు అంబులెన్స్ రాలేదు. 

గర్భిణిని బంధువులు ఎడ్ల బండిలో కడెంవాగు దాటించారు. ఆ తరువాత వాగువొడ్డునే ఆదివాసీ మహిళ మగ బిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణి పురిటినొప్పులతో నాలుగు గంటల పాటు నరకయాతన పడింది. పసుపుల వద్ద నొప్పులు ఎక్కువయ్యాయి. ఆ తరువాత అంబులెన్స్ లో స్థానికి పీహెచ్ సీకి తరలించారు. గతంలో పసుపుల వద్ద ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో వాగు అవతల ఉన్న ఆదివాసీలు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.