Asianet News TeluguAsianet News Telugu

ఆడపిల్ల పుడుతుందన్న అనుమానం.. నిండు గర్భిణి బలవన్మరణం...

ప్రస్తుతం రమ్య 9 నెలల గర్భిణీ. గురువారం ఆమెకు వైద్యులు డెలివరీ డేటును ఖరారు చేశారు. అయితే, తనకు మొదట ఆడపిల్ల పుట్టిందని.. ఇప్పుడు కూడా అమ్మాయే పుడుతుందేమోనని గత కొద్ది రోజులుగా రమ్య దిగులు పడుతోంది. అయితే ఈ విషయం గమనించిన భర్త ఆడపిల్లయినా, మొగ పిల్లవాడైన ఏమీ కాదని నచ్చచెప్పేవాడు. 

pregnant suicide in manchiryala
Author
Hyderabad, First Published Jan 7, 2022, 9:36 AM IST

మంచిర్యాల :  ‘ఆడపిల్ల పుడితే అరిష్టం’.. ‘మళ్లీ ఆడపిల్లనే కన్నావా..’ ‘అయ్యో ఇద్దరూ ఆడపిల్లలేనా’... ఇలాంటి మాటలు చాలా కాజువల్ గా మన చెవుల్లో పడుతుంటాయి. అయితే అత్యంత సాధారణంగా అనే ఆ మాటలు తల్లి కాబోయే ఆడపిల్లల మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పలేం. విషపు మొలకల్లాంటి ఆ మాటలు మనసులో నాటుకుపోయి.. భర్త, అత్తామామలు.. ఏం కాదు అని చెప్పినా నిండు ప్రాణాల్ని బలి తీసుకునేంత వరకూ వస్తాయి.

తనతో పాటు.. నవమాసాలూ కడుపులో మోసిన చిన్నారి నిండు జీవితాన్ని.. ఇంకా కళ్లైనా తెరవకముందే.. ఈ లోకాన్ని చూడకముందే చిదిమేసేలా చేస్తాయి. అలాంటి ఘటనే మంచిర్యాలలో చోటు చేసుకుంది. మళ్లీ girl child పుడుతుందేమో అనే Suspicionతో ఓ నిండు Pregnant ఉరివేసుకుని Suicide చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. 

ఈ విషాద ఘటన Manchiryalaలో చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దండేపల్లి మండలం నర్సాపూర్ కు చెందిన రమ్యను మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన ఆనంద్ కు ఇచ్చి 2017 లో వివాహం చేశారు. వీరి సంసార జీవితంలో మొదటగా ఆరాధ్య(3) జన్మించింది. ప్రస్తుతం రమ్య 9 నెలల గర్భిణీ. గురువారం ఆమెకు వైద్యులు డెలివరీ డేటును ఖరారు చేశారు. 
అయితే, తనకు మొదట ఆడపిల్ల పుట్టిందని.. ఇప్పుడు కూడా అమ్మాయే పుడుతుందేమోనని గత కొద్ది రోజులుగా రమ్య దిగులు పడుతోంది. 

అయితే ఈ విషయం గమనించిన భర్త ఆడపిల్లయినా, మొగ పిల్లవాడైన ఏమీ కాదని నచ్చచెప్పేవాడు. భర్తతోపాటు అత్తింటివారు, పుట్టింటి వారు కూడా అదే విషయం నచ్చజెప్పేవారు. అనవసరంగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవద్దని కూడా చెప్పేవారు. కానీ రమ్య మనసులో ఏముందో ఏమో.. కానీ ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి ఆమెను తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ‘ఎంత పని చేస్తివి బిడ్డా..’ అంటూ మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏడుస్తున్న తీరుతో జిల్లా ఆస్పత్రి దద్దరిల్లింది. అది చూస్తున్న స్థానికులను కలచివేసింది. ఈ కాలంలో కూడా ఆడపిల్ల పుడుతుంది అనే అనుమానంతో తనువు చాలించడం ఏంటని అయిన వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, హూజూరాబాద్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మోసం చేశాడని తెలుసుకుని, ఎలాగోలా అతని ఆచూకీ పట్టుకుని పట్టుదలతో 42 రోజులుగా diksha చేసిన ఆ యువతి పోరాటం విఫలం అయ్యింది. భర్త Cheatingతో చివరికి తనువు చాలించిన సంఘటన పలువురిని కలచివేసింది. తనను భార్యగా స్వీకరించాలనే డిమాండ్ తో చేసిన పోరాటం ఆమెను కానరాని లోకాలకు చేర్చి విషాదాంతంగానే ముగిసింది,

Follow Us:
Download App:
  • android
  • ios