హైదరాబాద్: హైద్రాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ లాడ్జీలో  ప్రవీణ్‌ అనే యువకుడు ఓ యువతి గొంతు కోశాడు.  ఆ తర్వాత తాను కూడ ఆత్మహత్యాయత్నం చేశాడు.  

దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్ లాడ్జీలో వీరిద్దరూ రూమ్ అద్దెకు తీసుకొన్నారు. మంగళవారం నాడు ఉదయం ఈ రూమ్ ను అద్దెకు తీసుకొన్నట్టుగా లాడ్జీ నిర్వాహకులు చెబుతున్నారు.

యువతి గొంతుకోసిన తర్వాత  తాను కూడ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. యువతి పరిస్థితి విషమంగా ఉందని  సమాచారం.బడంగ్‌పేటకు చెందిన మనస్విని ప్రవీణ్ అలియాస్ వెంకట్ గొంతు కోశాడు. ఆ తర్వాత ప్రవీణ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ప్రవీణ్‌ది నెల్లూరు జిల్లాగా గుర్తించారు.

మనస్వినితో ప్రవీణ్‌కు ఎలా పరిచయం ఏర్పడిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మనస్విని స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్‌ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఇద్దరి కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

బ్యాంకు కోచింగ్ సెంటర్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే ప్రవీణ్ అలియాస్ వెంకటేష్ ప్రవర్తన నచ్చని కారణంగా మనస్వని అతడిని దూరం పెట్టింది.

ఇవాళ బృందావన్ లాడ్జీలో ప్రవీణ్ రూమ్ అద్దెకు తీసుకొన్నాడు. మనస్విని ఫోన్ చేసి రమ్మని పిలిచాడు.  అయితే లాడ్జీకి వచ్చిన తర్వాత మనస్వికి, ప్రవీణ్ మధ్య గొడవ జరిగినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. లాడ్జీలోని సీసీపుటేజీని కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు లాడ్జీ సిబ్బంది నుండి  వివరాలు సేకరించారు.