హైదరాబాద్: వ్యక్తిగత కారణాలతో స్విట్జర్లాండ్ కు నడిచి వెళ్లాలని ప్రశాంత్ భావించాడని సజ్జనార్ చెప్పాడు. భారత్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ దూకి పాకిస్తాన్ సరిహద్దుల్లోకి వెళ్లినట్టుగా సజ్జనార్ చెప్పారు.  పాకిస్తాన్ లోకి అక్రమంగా చొరబడ్డాడని ప్రశాంత్ పై ఆ దేశం కేసు నమోదు చేసి జైలు శిక్ష విధించినట్టుగా ఆయన తెలిపారు. ప్రియురాలి కోసం స్విట్జర్లాండ్ వెళ్తూ పాకిస్తాన్ లో పట్టుబడిన ప్రశాంత్ ను  ఆయన సోదరుడికి సైబరాబాద్ సీపీ సజ్జనార్ అప్పగించారు. మంగళవారం నాడు సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. 

also read:అమ్మ మాట వినకుండా వెళ్లి పాక్‌లో చిక్కుకొన్నా: టెక్కీ ప్రశాంత్

2019 నవంబర్ లో ప్రశాంత్ తన తండ్రికి ఫోన్ చేసి తాను పాకిస్తాన్ జైలులో ఉన్నట్టుగా సమాచారం ఇచ్చాడన్నారు. ఈ విషయాన్ని ప్రశాంత్ తండ్రి తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు.  నిన్న ప్రశాంత్ పాకిస్తాన్ జైలు నుండి రిలీజ్ అయ్యారన్నారు. వాఘా సరిహద్దుల్లో ప్రశాంత్ ను  తెలంగాణ పోలీసులకు అప్పగించారన్నారు. ప్రశాంత్ ను వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. 

2017 ఏప్రిల్ మాసంలో హైద్రాబాద్ నుండి టెక్కీ ప్రశాంత్ అదృశ్యమయ్యాడన్నారు.  ఆ సమయంలో ఆయన హైద్రాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ప్రశాంత్ పనిచేస్తున్నాడని ఆయన చెప్పారు. వాఘా సరిహద్దులో భారత్ కు పాకిస్తాన్ అధికారులు నిన్న అప్పగించారని సీపీ సజ్జనార్ తెలిపారు.  పాకిస్తాన్ విదేశాంగ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రశాంత్ విడుదల కోసం చర్యలు తీసుకొన్నామన్నారు. 

ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు కోసం సంప్రదింపులు జరిపామన్నారు. ఎంబసీ అధికారులతో మాట్లాడి ప్రశాంత్  విడుదల కోసం చర్యలు చేపట్టారు.  సజ్జనార్ చొరవతో  ప్రశాంత్ ను పాకిస్తాన్  అధికారులు వాఘా సరిహద్దు వద్ద అప్పగించినట్టుగా ఆయన తెలిపారు.   మీడియా సమావేశంలోనే ప్రశాంత్ సోదరుడికి సజ్జనార్ అప్పగించాడు. సోదరుడిని హత్తుకొని ప్రశాంత్ బావోద్వేగానికి గురయ్యాడు.