ప్రజాశాంతి పార్టీకి ఈసీ దిమ్మతిరిగే షాక్.. హైకోర్టును ఆశ్రయించిన కేఏ పాల్.. ఇంతకీ ఏం జరిగిందే?
తెలంగాణలో గానీ, ఆంధ్రప్రదేశ్ లో గానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సందడి చేసే వ్యక్తి కేఏ పాల్. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలల్లో కూడా కేఏ పాల్ తన పార్టీని ఎన్నికల బరిలో దించారు. అయితే.. ఎన్నికల సంఘం ఆయనకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అసలు కథేంటంటే..?
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలు రచిస్తున్నాయి. నువ్వా ? నేనా? అన్నట్టు తలపడుతున్నాయి. ఈ తరుణంలో పలు ఆసక్తికర ఘటనలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ ఎన్నికలు వచ్చిన సందడి చేసే వ్యక్తి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు ఆయన సిద్దమయ్యారు. ఈ మేరుకు 119 స్థానాలకు గానూ.. 19 స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులకు బరిలో దించడానికి రంగం సిద్దం చేశారు. ఈ క్రమంలో వారికి పార్టీ తరుపున బీఫామ్స్ కూడా ఇచ్చేశారు. కానీ, ఈ సమయంలోనే కేఏ పాల్ పార్టీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ప్రజాశాంతి పార్టీకి గుర్తింపు లేదని తెలిపింది.
ఈ పరిణామంపై కేఏ పాల్ సీరియస్ గా స్పందించారు. తనది రిజిష్టర్డ్ పార్టీ అని, తాను అన్ని డాక్యుమెంట్లు సబ్మిట్ చేసినా తమకు ఎన్నికల గుర్తు కేటాయించడం లేదని ఈసీ అధికారులపై ఆగ్రహించారు. తన కూడా పెద్ద ఎత్తున ఓటు బ్యాంకు ఉందంటూ గగ్గోలు పెడుతున్నారు. అసలు ఇప్పటి వరకూ పోటీ చేయని షర్మిల వైఎస్ఆర్టీపీకి గుర్తును కేటాయించి తనకు రద్దుచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ కనుసన్నల్లో ఈసీ అధికారులు నడుస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ ఇనాక్టివ్ కారణంగా పోటీలో లేనందున కేఏ పాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎన్నికలను ప్రజలు బహిష్కరించాలని కోరారు.లడాక్‌లో ఒక చిన్న పార్టీకి సింబల్ ఇవ్వలేదని ఎన్నికలు రద్దు చేశారని, తమ పార్టీ ఇనాక్టివ్ అని చెప్పి సింబల్ కేటాయించక పోవడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేస్తున్నట్టు చెప్పారు. ఈ తరుణంలో ఆయన హైకోర్టును ఆశ్రయించామన్నారు. దీనిపై ఈ నెల 14వ తేదీన హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తామన్నారు.
వాస్తవానికి కేఎల్ ప్రారంభించిన ప్రజాశాంతి పార్టీ తొలిసారి 2014 ఏపీలో జరిగిన ఎన్నికల్లో పాటీ చేసింది.అప్పుడు ఎన్నికల సంఘం హెలీకాఫ్టర్ గుర్తును కేటాయించింది. కానీ పోటీ చేసిన ఏ స్తానంలోనూ డిపాజిట్లు కూడా దక్కలేదు. ఆ తరువాత తెలంగాణలో జరిగిన మునుగోడు ఉప ఎన్ని్కల్లో కూడా కేఏ పాల్ పోటీ చేశారు. అప్పుడు ఉంగరం గుర్తును కేటాయించింది. కానీ ఎటువంటి ఫలితం లేదు. దీంతో ఈసీ పార్టీ గుర్తింపు తొలగించింది.