ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనపై హత్యా ప్రయత్నం జరిగిందని డీజీపీ అజంనీకుమార్‌కు ఫిర్యాదు చేశారు. కొందరు పోలీసు అధికారులు సివిల్ డ్రెస్‌లో వచ్చి తనను భయభ్రాంతులకు గురి చేశారని పేర్కొన్నారు.
హైదరాబాద్: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి వార్తల్లోకెక్కారు. తెలంగాణ డీజీపీకి ఆయన పోలీసులపైనే ఫిర్యాదు చేశారు. డీజీపీ ఆఫీసుకు వెళ్లి మరీ డీజీపీ అంజనీ కుమార్‌ను కేఏ పాల్ కలిశారు. తనపై హత్యా ప్రయత్నం జరిగిందని పోలీసులపైనే ఫిర్యాదు చేశారు. ఈ నెల 23వ తేదీన కొంత మంది తనను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తనను చంపడానికి వచ్చిన వారిలో పోలీసు అధికారులూ ఉన్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
తనపై హత్యా ప్రయత్నానికి వచ్చినవారిలో సదాశివపేట ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, మహిళా ఎస్ఐ లక్ష్మీ వచ్చారని కేఏ పాల్ పేర్కొన్నారు. వీరు సివిల్ డ్రెస్‌లో వచ్చి తనను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు.
Also Read: Congress Strategy: తెలంగాణలో కర్ణాటక ఫార్ములా.. హైకమాండ్ సూచించిన ఐదు ముఖ్యమైన పాయింట్లు ఇవే
తన ఫిర్యాదుపై డీజీపీ అంజనీ కుమార్ సానుకూలంగా స్పందించారని కేఏ పాల్ వివరించారు. వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
ఇదే సందర్భంలో ఆయన బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. ఇప్పటికే కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే రాజయ్య, దుర్గం చెన్నయ్య, కౌశిక్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేశారు.
