Asianet News TeluguAsianet News Telugu

రోడ్డుపై దర్శనమిచ్చిన ప్రజా పాలన దరఖాస్తులు.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్

తెలంగాణ ప్రభుత్వం (telangana government) ప్రతిష్టాత్మకంగా ప్రజల నుంచి స్వీకరించిన ప్రజా పాలన దరఖాస్తులు (prajapalana applications) హైదరాబాద్ (hyderabad)లోని బాలానగర్ రోడ్డు (balangar road)పై దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (videos viral)గా మారాయి. 
 

Prajapalana applications seen on the balanagar road.. Videos on social media are viral..ISR
Author
First Published Jan 9, 2024, 7:10 PM IST

prajapalana application : తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు అమలు చేసేందుకు ప్రజల నుంచి ‘అభయహస్తం - ప్రజా పాలన’ దరఖాస్తులను స్వీకరించింది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని హామీ ఇచ్చింది. దాని కోసం ప్రజా పాలన దరఖాస్తులను రూపొందించింది. గతేడాది డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ ఏడాది జనవరి 6వ తేదీ వరకు అర్హుల నుంచి వాటిని స్వీకరించింది. 

ప్రధాని ప్రతీది పర్సనల్ గా తీసుకుంటారు - భారత్-మాల్దీవుల వివాదంపై మల్లికార్జున్ ఖర్గే

వాటిని ప్రభుత్వం కంప్యూటరైజ్డ్ చేస్తామని ప్రకటించింది. అయితే అధికారుల వద్ద ఉండాల్సిన ప్రజా పాలన దరఖాస్తులు సోమవారం హైదరాబాద్ లోని బాలానగర్ లో దర్శనమిచ్చాయి. వాటిని ఓ వాహనదారుడు టూ వీలర్ పై తీసుకెళ్తుండగా.. గాలికి ఎగిరిపోయాయి. ఏవో పేపర్లు గాలికి ఎగిరపోయాయని అటుగా వెళ్తున్న వాహనదారులు అతడికి సహాయం చేశారు. వాటిని ఏరుకొని వచ్చి అతడికి అందించారు. అయితే అవన్నీ హయత్ నగర్ సర్కిల్ కు చెందిన ప్రజా పాలన దరఖాస్తులే కావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ప్రభుత్వ ఆఫీసుల్లో, అధికారుల చేతిలో ఉండాల్సిన ఆ దరఖాస్తు ఫారాలు అతడి వద్ద ఎందుకు ఉన్నాయో వారికి అర్థం కాలేదు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని అతడిని నిలదీశారు. హయత్ నగర్ కు సంబంధించిన ప్రజా పాలన దరఖాస్తు ఫారాలు బాలానగర్ లో ఎందుకు ఉన్నాయని స్థానికులు, వాహనదారులు ప్రశ్నించడంతో అతడు కంగారు పడ్డారు. 

కేఏ పాల్ కు జగన్ నివాసం వద్ద చేదు అనుభవం.. శపిస్తానన్న ప్రజా శాంతి పార్టీ చీఫ్..

ర్యాపిడో బుక్ చేయడంతో తాను ఆ ఫారాలను ఒక ప్లేస్ ల నుంచి మరో ప్లేస్ కు తీసుకెళ్తున్నానని ఆ యువకుడు బదులిచ్చాడు. ఈ విషయం తప్ప తనకు ఏమీ తెలియదని తేల్చి చెప్పారు. అయితే దీనిని పలువురు తమ సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios