Asianet News TeluguAsianet News Telugu

Prajavani: ప్రజావాణిలో ఫిర్యాదు.. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఆ కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం.. 

CM Revanth Reddy: ప్రజావాణిలో భాగంగా విధులు నిర్వహిస్తుండగా చనిపోయిన కానిస్టేబుల్ భార్య..  సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకుని తన దీనస్థితిని తెలిపారు. మానవతా దృక్పథంతో స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
 

Praja Vani effect Widow of Hyderabad constable granted job KRJ
Author
First Published Jan 10, 2024, 3:27 AM IST

Prajavani: విధులు నిర్వర్తిస్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఆయన కుటుంబానికి అండగా నిలివాల్సిన గత ప్రభుత్వం మొండిచేయి చూపింది. స్థానికత సాకుతో కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాన్ని నిరాకరించింది. తాజాగా,.ఆ కానిస్టేబుల్  కుటుంబం తమ దీనస్థితిని ప్రజావాణి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి తెలుసుకున్నారు. వారి పరిస్థితి చూసి చలించిన సీఎం .. మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి కానిస్టేబుల్ భార్యకు ఉపాధి కల్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఆమెకు జూనియర్ అసిస్టెంట్‌ ఉద్యోగం కల్పిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు.

వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ సొంగా శేఖర్  2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అయితే.. ఆయన భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్ కు చెందడంతో స్థానికత పేరుతో ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించింది. ఇలా గత రెండేళ్లుగా ఆ కానిస్టేబుల్ కుటుంబం ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులందించినా..ఫలితం మాత్రం శూన్యం. తాజాగా ఆ బాధిత కుటుంబం ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని వివరించారు. వారి పరిస్థితి చూసి చలించిన సీఎం.. సత్వరమే స్పందించారు.  మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి.. కానిస్టేబుల్ శేఖర్ భార్యకు ఉద్యోగం ఇవ్వాలని రాష్ర్ట రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), రాచకొండ పోలీసు కమిషనర్‌లకు  ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా సత్యలత ఉద్యోగం కల్పిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్దవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని రాచకోండ సీపీ కోరారు. అంతేకాదు, భవిష్యత్తులో ఆ కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు.  సత్వరమే స్పందించి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డీజీపీ, రాచకొండ సీపీకి కానిస్టేబుల్‌ శేఖర్‌ కుటుంబసభ్యులు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios