ఓ వ్యక్తి చనిపోయిన 22 రోజులకు కుటుంబసభ్యులకు అతని మృతి మీద అనుమానం వచ్చింది. అప్పటివరకు సహజమరణమేమో అనుకున్నవారికి.. అతని ఫోన్ లో బయటపడ్డ ఓ వీడియో షాక్ కు గురి చేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించారు.
నల్గొండ : ఖననం చేసిన ఇరవై రెండు రోజుల తర్వాత dead bodyకి Postmortem నిర్వహించారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని గుడిపల్లి గ్రామపంచాయతీ సింగరాజు పల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. వనస్థలిపురం ఎస్ఐ జగన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగరాజు పల్లి గ్రామానికి చెందిన రొయ్య నాగమ్మ, సోమయ్యల కుమారుడు యాదగిరి (34) హైదరాబాదులోని హస్తినాపురంలో ఫోటో స్టూడియో నిర్వహించేవాడు.
జనవరి 17వ తేదీ ఉదయం ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యాదగిరి సాయంత్రం తిరిగి వచ్చాడు. Abdominal painగా ఉందని భార్య విజయలక్ష్మికి తెలియజేయడంతో వెంటనే Osmania Hospitalకి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ జనవరి 18వ తేదీ రాత్రి యాదగిరి మృతి చెందాడు. అదేరోజు మృతదేహాన్ని Buried చేశారు. అయితే ఆ సమయంలో యాదగిరి ఫోన్ లాక్ ఉంది. ఇటీవలే అతని తమ్ముడు వెంకటేష్ ఫోన్ Unlock చేయించాడు.
ఇందులో Conflict with friendsకు సంబంధించిన వీడియో ఫోన్లో రికార్డయింది. దీంతో యాదగిరిని గాయపరచడం వల్లే మృతి చెందాడని అనుమానం వ్యక్తం చేస్తూ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఈ నెల 9న ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వనస్థలిపురం ఎస్ఐ జగన్ సంఘటనా స్థలానికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ శ్రీదేవి సమక్షంలో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికి తీయగా దేవరకొండ డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, నిరుడు డిసెంబర్ 21న సెల్ ఫోన్ కోసం గొడవపడి స్నేహితున్ని చంపిన ఘటన ఆసిఫ్ నగర్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 26 సంత్సరాల జితేందర్ ఉపాధి కోసం ఇటీవలే హైదరాబాద్ కు వచ్చాడు. ఆసిఫ్ నగర్ ఏరియా జిర్రాలోని వర్క్‌షాపులో కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. పనిచేసుకుంటూ వర్క్‌షాపులోనే ఉండేవాడు. ఇదిలావుండగా, ఇటీవల అతని స్నేహితుడు ఫరూఖ్ కూడా ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చాడు. తన స్నేహితుడైన జితేందర్ వద్దకు వచ్చి.. అతనితో కలసి వర్క్‌షాపులోనే ఉంటున్నాడు.
అయితే, ఆదివారం ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. అనూహ్యంగా జితేందర్ వర్క్‌షాప్‌లో శవమై కనిపించాడు. ఉత్తరప్రదేశ్ నుంచి ఇటీవలే వచ్చిన ఫరూక్ సైతం తీవ్రగాయలతో అక్కడే పడి ఉన్నాడు. ఉదయం యజమాని ముంతాజిర్ వర్క్ షాప్ వద్దకు రాగానే ఈ భయానక దృశ్యాలు కనిపించాయి. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఘటనపై ఆరా తీశారు.
ఈ దారుణానికి ముందు రోజు రాత్రి ఇద్దరు స్నేహితుల మధ్య సెల్‌ఫోన్ విషయమై గొడవ జరిగినట్లు ఆసిఫ్ నగర్ ఇన్‌స్పెక్టర్ రవీందర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే వీరిద్దరు గొడవపడ్డారనీ, ఆవేశానికి లోనై ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ఈ ఘటన గురించి ఇన్‌స్పెక్టర్ రవీందర్ వివరిస్తూ.. జితేందర్ ఫోన్ ఇవ్వాలని ఫరూఖ్ అడిగాడని.. అందుకు అతను నిరాకరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు చెప్పారు. దీంతో ఇద్దరూ వర్క్‌షాపులో చేతికందిన వస్తువులతో పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా కొట్టుకున్నారు. ప్రమాదకర గాయాలు అయ్యాయి. దాడిలో తలకు తీవ్రగాయం కావడంతో జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అలాగే, వీరిద్దరి గొడవలో ఫరూఖ్ కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కేసు నమోదుచేసుకుని పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తాం అని తెలిపారు. ప్రస్తుతం ఫరూక్ చికిత్స అందిస్తున్నామన్నారు.
