Telangana Elections 2023: ఓట్ల వేష‌గాళ్లు అవ‌స‌ర‌మా మ‌న‌కు? .. రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌కు నిర‌స‌న సెగ

Mulugu: గిరిజన యూనివర్సిటీ గురించి పార్లమెంట్లో ఏనాడు మాట్లాడలేదనీ, రామప్ప అభివృద్ధి నిధుల గురించి ఏనాడు  కూడా కేంద్రాన్ని అడగలేదనీ,  పార్లమెంట్లో  ప్రస్తావించలేదని, వనదేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా గురించి ఏనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు రాగానే తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో పోస్ట‌ర్లు వెలిశాయి.
 

Posters in Mulugu against Congress leader Rahul Gandhi's visit to Telangana RMA

Telangana Congress: తెలంగాణలోని ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం పూజలు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆలయానికి చేరుకుని పూజలు చేసి వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే, రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో నిర‌సిస్తూ ములుగు నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు 2023 నేప‌థ్యంలో ఎన్నిక‌ల ప్ర‌చార శంఖ‌రావం పూరించ‌డానికి కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే, రాహుల్ గాంధీ పర్య‌ట‌న‌కు నిర‌స‌న‌ల సెగ త‌గిలింది. రాహుల్ గాంధీ పర్యటనను నిరసిస్తూ ములుగు నియోజకవర్గంలో పోస్టర్లు వెలిశాయి. ములుగు జిల్లా గురించి ఏనాడు మాట్లాడని రాహుల్ గాంధీ ఇప్పుడు ఓట్ల కోసం వచ్చాడంటూ పోస్ట‌ర్ల‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు.

గిరిజన యూనివర్సిటీ గురించి పార్లమెంట్లో ఏనాడు మాట్లాడలేదనీ, రామప్ప అభివృద్ధి నిధుల గురించి ఏనాడు  కూడా కేంద్రాన్ని అడగలేదనీ,  పార్లమెంట్లో  ప్రస్తావించలేదని,  వనదేవతలైన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా గురించి ఏనాడు కూడా పార్లమెంట్లో మాట్లాడని వ్యక్తి ఇప్పుడు ఎన్నికలు రాగానే తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో పోస్ట‌ర్లు వెలిశాయి.

ఓట్ల కోసం పరుగెత్తుకుంటూ వచ్చాడని రాహుల్ గాంధీ ఫోటోతో పాటు ఈ ప్రాంతంలోని ప‌లు కీల‌క అంశాల‌ను గురించి ఏనాడు ప్ర‌స్తావించ‌లేద‌ని పోస్ట‌ర్ల‌లో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి ప్రజలే పోస్టర్లు వేసినట్టుగా తెలుస్తోంది. అయితే, పోస్ట‌ర్ల వెనుక అధికార పార్టీ బీఆర్ఎస్ తో పాటు మ‌రో ప్ర‌తిప‌క్ష పార్టీ బీజేపీ కూడా ఉంద‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే, తాజాగా వెలిసిన పోస్టర్లు చూసి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ తీరుపై ప్ర‌జ‌ల్లో జోరుగా చ‌ర్చ సాగుతోంది. "ఓట్ల వేటగాళ్లు అవసరమా మనకు" అంటూ పోస్టర్ల‌లో వ్యాఖ్య‌లతో పాటు సీతక్క గానీ, రాహుల్ గాంధీ గానీ ఏనాడ ములుగును పట్టించుకోలేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇదిలావుండ‌గా, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు  బుధవారం తెలంగాణ ములుగు జిల్లాలోని రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. వీరి వెంట రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎ. రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఇతర నేతలు ఉన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. రాహుల్, ప్రియాంకలు పాలుపంచుకున్న ములుగులో జరిగే బహిరంగ సభ, కాంగ్రెస్‌ ముఖ్యనేతల పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios