ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై బీజేపీ నేతల విమర్శలు, దాడులు తగవని అన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. 

బీజేపీ పార్టీ మనువాద పార్టీ అని, బండి సంజయ్ తెలివి లేక R.S. ప్రవీణ్ కుమార్ పై విమర్శలు చేస్తున్నాడని విరుచుకుపడ్డారు. బీజేపీ నాయకులకు దళితులు చదువుకుంటే ఇష్టం ఉన్నట్టు లేదని అన్నారు. బీజేపీలో వున్న దళిత నాయకులు బయటకు వచ్చి బీజేపీ నేతలను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. 

ప్రజాస్వామ్యంలో నాస్తికులుగా ఉండవచ్చు, ఆస్తికులుగా కూడా ఉండవచ్చును.హిందూ దేవుళ్లను ఆరాధించక పోతే దేశద్రోహం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. నేను నికార్సైన హిందువును.. అయితే బిజెపి పార్టీకి దళితులు ముందుకు వస్తే మింగుడు పడడం లేదు అన్నారు.

దళితులు ఈరోజు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే, దానికి స్వేరోస్ లాంటి సంస్థలే కారణం అన్నారు. దళితుల కోసం దళితుల అభ్యున్నతి కోసం పాటుపడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. బిజెపి పార్టీ ఇకనైనా మనువాద రాజకీయాలు వీడి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ పై విమర్శలు ఆపాలన్నారు.