పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. త్వరలోనే అమిత్ షాతో భేటీ..!
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది.
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే.. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఆయన త్వరలోనే కాషాయ పార్టీ కండువా కప్పుకోనున్నట్టుగా సమాచారం. ఇప్పటికే బీజేపీ అధిష్టానం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మంతనాలు జరుపుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంక్రాంతి తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. ఆ తర్వాతే పొంగులేటి పార్టీ మార్పుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
త కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూరం అవుతున్నారనే ప్రచారం సాగుతుంది. న్యూ ఈయర్ సందర్భంగా ఆత్మీయ సమావేశం నిర్వహించిన పొంగులేటి.. ఈసారి ఎన్నికల్లో తనతో పాటు తన అనుచురులు కూడా పోటీ చేస్తారని ప్రకటించారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉన్న 3+3 భద్రతను 2+2కు కుదించిన ప్రభుత్వం.. ఆయన పర్యటనల సమయంలో వినియోగించే కాన్వాయ్‌లోని ఎస్కార్టు వాహనాన్ని కూడా తొలగించింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానానికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మధ్య చెడిందని.. పార్టీ ఆయనను దూరం పెట్టిందనే ప్రచారం మరింత జోరుగా సాగుతుంది.
తాజాగా ఆదివారం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఎన్నో అవమానాలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే రాజకీయ కురుక్షేత్రంలో యుద్దానికి తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎలాంటి పదవులు లేకపోయినా నాలుగేళ్లుగా ప్రజల మధ్య ఉంటున్నానని.. వారికి కష్టం వస్తే తానున్నాననే భరోసా కల్పించానని చెప్పారు.