పదవులున్నా లేకున్నా ప్రజల ప్రేమాభిమానాలు పొందినప్పుడే ప్రజా ప్రతినిధులకు గౌరవం ఉంటుందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇవాళ ఖమ్మంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం:పదవులున్నా లేకున్నా ప్రజల ప్రేమాభిమానాలు పొందినప్పుడే వ్యక్తిత్వానికి గౌరవం ఉంటుందని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బుధవారం నాడు నిర్వహించిన ఓ కార్యక్రమంలో Ponguleti Srinivas Reddy ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం Khammam రాజకీయాల్లో కలకం రేపుతున్నాయి. బతికినంత కాలం అధికారం నీతో ఉండదన్నారు. పదవులు ఎవరికీ శాశ్వతం కాదన్నారు. పదవులున్నా లేకున్నా ప్రజల అభిమానాలు పొందినప్పుడే ప్రజా ప్రతినిధుల వ్యక్తిత్వానికి గౌరవం పెరుగుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు ప్రజా ప్రతినిధులంతా గమనంలో పెట్టుకోవాలని ఆయన సూచించారు.
2014 ఎన్నికల్లో YCP అభ్యర్ధిగా ఖమ్మం నుండి పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి KCR టికెట్ ఇవ్వలేదు. TDP నుండి టీఆర్ఎస్ లో చేరిన Nama Nageswara Raoకి ఖమ్మం టికెట్టిచ్చారు. ఖమ్మం ఎంపీ స్థానం నుండి నామా నాగేశ్వరరావు ఎంపీగా విజయం సాధించారు. అయితే ఇప్పటివరకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి TRS నాయకత్వం ఎలాంటి పదవిని ఇవ్వలేదు.
2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కొందరు అధికార పార్టీ అభ్యర్ధుల ఓటమికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కారణమని అధిష్టానానికి ఓటమి పాలైన అభ్యర్ధులు ఫిర్యాదు చేశారని అప్పట్లో ప్రచారం సాగింది. దీంతోనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి టీఆర్ఎస్ నాయకత్వం ఏ బాధ్యతలు కూడా ఇవ్వలేదనే ప్రచారం కూడా లేకపోలేదు. అయితే తనపై సాగుతున్న ప్రచారాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖండించారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జిల్లా వ్యాప్తంగా అనుచరులున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. గత నెలలో మాజీ మంత్రి Jupally Krishna Rao పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. అదే సమయంలో మాజీ మంత్రి Tummala Nageswara Raoతో కూడా భేటీ అయ్యారు. ఈ ముగ్గురు కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. కానీ ఈ ముగ్గురికి టీఆర్ఎస్ ఎలాంటి పదవులు ఇవ్వలేదు.
ఇటీవలనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కూడా తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యాఖ్యలు చేశారు. ఎక్కవ కాలం ఆయన వ్యవసాయక్షేత్రానికే పరిమితమౌతున్నారు.
