కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల భేటీ ముగిసింది. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకెళ్లాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు.
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల భేటీ ముగిసింది. దాదాపు అరగంటకు పైగా వీరి మధ్య చర్చలు జరిగాయి. అనంతరం జూలై 2న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు రావాల్సిందిగా రాహుల్‌ను పొంగులేటి, జూపల్లి కోరారు. అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేతలంతా పార్టీలోకి తిరిగి రావడం ఆనందంగా వుందన్నారు. టీ.కాంగ్రెస్‌లో ఘర్ వాపసి జరుగుతోందని రాహుల్ పేర్కొన్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో నినాదంతో ముందుకెళ్లాలని రాహుల్ గాంధీ నేతలకు సూచించారు. ఈ భేటీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
