హైదరాబాద్: తెలంగాణలో జరిగిన మినీ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. శుక్రవారంనాడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలసిందే. కోవిడ్ నిబంధనలతో ఓటింగ్ ప్రక్రియ జరిగింది.

వరంగల్ మహా నగర పాలక సంస్థ, ఖమ్మం నగరపాలక సంస్థలతో పాటు సిద్ధిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగింది. 

ఈ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. అన్ని చోట్లా విజయకేతనం ఎగురేయాలని టీఆర్ఎస్ ఆశిస్తుండగా, కాంగ్రెసు, బిజెపి సత్తా చాటాలని చూస్తున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ జరిగింది. దీంతో ఫలితాలు రావడానికి జాప్యం జరిగే అవకాశం ఉంది. 

కోవిడ్ నెగెటివ్ ఉన్నవారినే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  బ్యాలెట్ పేపర్లను కట్టలు కట్టే ప్రక్రియ తొలుత ప్రారంభమైంది.