Asianet News TeluguAsianet News Telugu

భారీ వర్షాలతో హైద్రాబాద్-వరంగల్ హైవేపై వరద నీరు: ట్రాఫిక్ మళ్లింపు

భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్-హైద్రాబాద్ హైవేపై  భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో  అధికారులు ట్రాఫిక్ ను మళ్లించారు.

Police Traffic Diverted due to  flood water  On  Warangal-Hyderabad High way Road lns
Author
First Published Jul 27, 2023, 11:36 AM IST

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో వరంగల్-హైద్రాబాద్ హైవేపై  భారీగా వరద నీరు ప్రవహిస్తుంది.  హైద్రాబాద్- వరంగల్ మార్గంలోని  చాగల్లు వద్ద హైవేపై  దీంతో  అధికారులు ట్రాఫిక్ ను మళ్ళించారు.  తెలంగాణ రాష్ట్రంలో నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

దీంతో వరద నీరు  రోడ్లపై ప్రవహిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి.  దీని ప్రభావంతో  పలు ప్రాంతాలు నీట మునిగాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో  రెండు రోజుల పాటు  భారీ వర్షాలు  కురిసే  అవకాశం ఉందని  వాతావరణ  శాఖ హెచ్చరికలు జారీ చేసింది.  దీంతో  ప్రజలు భయాందోళనలు వ్యక్తం  చేస్తున్నారు.
రాష్ట్రంలోని  23 జిల్లాలకు  ఐఎండీ  అలర్ట్ జారీ చేసింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను కూడా జారీ చేసిన విషయం తెలిసిందే. ఐఎండీ  అలెర్ట్  జారీ  చేసినట్టుగానే భారీ వర్షాలు కురుస్తున్నాయి.

also read:మోరంచపల్లి వాసులకు ఆహారం, నీళ్లు సరఫరా: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మోరంచవాగు నీటిలో మోరంచవాగు నీట మునిగింది.  ఈ గ్రామంలో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లపై నిలబడి స్థానికులు  సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. మోరంచపల్లిలో  రెస్క్యూ టీమ్  సహాయక చర్యలను ప్రారంభించింది.

Follow Us:
Download App:
  • android
  • ios