Asianet News TeluguAsianet News Telugu

ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు... వీణవంకలో ఉద్రిక్తత (వీడియో)

ఇవాళ(మంగళవారం)హుజురాబాద్ నియోజకవర్గ పర్యటనలో భాగంగా వీణవంక మండలంలో పర్యటిస్తున్న బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ను పోలీసులు అడ్డుకున్నారు.

police stops etala rajender rally at huzurabad akp
Author
Huzurabad, First Published Jun 22, 2021, 3:11 PM IST

కరీంనగర్: టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికే కాదు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రస్తుతం హుజురాబాద్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ(మంగళవారం) వీణవంక మండలంలో పర్యటిస్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. భారీ ర్యాలీగా వెళుతుండగా డిజె కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఈటల అనుచరులు, బిజెపి నాయకులు పోలీసులతో వాగ్విదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

వీణవంక మండలంలోని వల్బపూర్ గ్రామానికి ఈటల రాగాబిజెపి నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడి నుండి వీణవంక వరకు ర్యాలీగా వెళ్తున్న క్రమంలో ర్యాలీలో డిజే కు పర్మిషన్ లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన బిజెపి కార్యకర్తలకు పోలీసులతో తీవ్ర వాగ్వివాదానికి దిగుతూ పోలీసు వాహనాన్ని చుట్టుముట్టారు. అయితే పోలీసులు మాత్రం వెనక్కి తగ్గకుండా  సౌండ్ ఎక్కువ పెట్టకుండా కేబుల్ ను తొలగించారు.

వీడియో

ఇదిలావుంటే టీఆర్ఎస్ పార్టీ జెండాకు తాను కూడా ఓనర్ నే అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఈటల తాజాగా వివరణ ఇచ్చారు. ఏ పార్టీలో అయినా కార్యకర్త కూడా జెండాకి ఓనరే అని చెప్పాల్సిందేనని... ఒక వ్యక్తి ఓనర్ ఉండడని చెప్పానన్నారు. అందుకోసమే నేను కూడా ఓనరేనని చెప్పానని ఈటల వ్యాఖ్యానించారు. 

read more  హుజురాబాద్‌లో టీఆర్ఎస్ దండుపాళ్యం... ఈటల జోలికి వస్తే: కేసీఆర్‌కి సంజయ్ వార్నింగ్

హుజురాబాద్ ప్రజలు తనను ఆరుసార్లు గెలిపించారని రాజేందర్ అన్నారు. హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని ఈటల జోస్యం చెప్పారు. తమ హక్కులకు భంగం కలిగితే దేనికైనా రెడీగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారం నెత్తికెత్తి అహంకారంతో మాట్లాడుతున్నారని రాజేందర్ ఆరోపించారు. 

కాగా ఈటల సతీమణి జమున కూడా కేసీఆర్ సర్కార్ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకొన్నాం, కానీ కొత్త ఉద్యోగాలు లేవన్నారు. కానీ గొంతెత్తి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని  జమున చెప్పారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios