ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో సెవెన్ సీటర్ ఆటోలో 17 మందిని తీసుకెళ్తుండగా పోలీసులు ఆటోను నిలిపివేశారు. ఆటోలో 14 మందితో వారిని గమ్యస్థానాలకు చేరవేస్తున్న విషయాన్ని మహబూబ్ నగర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
మహబూబ్‌నగర్: ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలో సెవెన్ సీటర్ ఆటోలో 17 మందిని తీసుకెళ్తుండగా పోలీసులు ఆటోను నిలిపివేశారు. ఆటోలో 14 మందితో వారిని గమ్యస్థానాలకు చేరవేస్తున్న విషయాన్ని మహబూబ్ నగర్ పోలీసులు ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
ఏందన్నా!
— Telangana State Police (@TelanganaCOPs) December 18, 2020
అది ఆటో నా ?? మినీ బస్సా ??
7 సీటరా లేక 14 సీటరా ??
ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ?? https://t.co/ks8zxgdhLy
ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెవెన్ సీటర్ ఆటోలో 17 మంది ప్రయాణీస్తున్నారు.ఈ ఆటోలో నుండి 17 మంది దిగగానే పోలీసులు షాక్ తిన్నారు.
ఈ ఫోటోను ట్విట్టర్లో పోలీసులు షేర్ చేశారు. ఈ ఫోటోపై నెటిజన్లు తలో రకంగా స్పందిస్తున్నారు.ఈ విషయమై ఆటో డ్రైవర్ తో పాటు ప్రయాణీకులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఓవర్ లోడ్ తో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆటోలో ప్రయాణించేవారికే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పోలీసులు వారికి వివరించారు. పరిమితికి మించి ఆటోల్లో ప్రయాణీకులను తరలించవద్దని పోలీసులు కోరారు.
బాలానగర్ కు చెందిన బ్లూకాట్ అధికారులు నర్సింహ్ములు లక్ష్మణ్ లు ఈ ఆటోను నిలిపివేసి డ్రైవర్ సహా ప్రయాణీకులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 18, 2020, 5:15 PM IST