నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి కిడ్నాప్ కేసు .. ఎట్టకేలకు తల్లి చెంతకు బాలుడు
హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఆరు నెలల పసిబాలుడు ఎట్టకేలకే తల్లిచెంతకు చేరాడు. నిజామాబాద్‌లో కిడ్నాపర్లను గుర్తించారు పోలీసులు.

హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో కొద్దిరోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఆరు నెలల పసిబాలుడు ఎట్టకేలకే తల్లిచెంతకు చేరాడు. నిజామాబాద్‌లో కిడ్నాపర్లను గుర్తించారు పోలీసులు. వారి నుంచి బాబును రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక, ఆసుపత్రిలో బాలుడి తల్లి ఫరీదా బేగంతో స్నేహం చేసిన మహిళ పసిబిడ్డను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీటీవీ ఫుటేజ్‌లో మహిళ పాపను ఎత్తుకెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి. బాలుడి తల్లి ఫరీదాకు మాయమాటలు చెప్పి నిందితురాలు ఈ కిడ్నాప్ చేసిందని గుర్తించారు.