పాలకుర్తి  ప్రభుత్వాసుపత్రిలో  బండి  సంజయ్ కు  వైద్య పరీక్షలు నిర్వహించారు.  అనంతరం  ఆయనను హన్మకొండ కు తరలిస్తున్నారు  పోలీసులు.  

హన్మకొండ: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు బుధవారంనాడు పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుండి బండి సంజయ్ ను పాలకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాలకుర్తి ప్రభుత్వాసుపత్రిలో బండి సంజయ్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనను హన్మకొండ కోర్టులో హాజరుపర్చనున్నారు. పాలకుర్తి ప్రభుత్వాసుపత్రి వద్ద నుండి బండి సంజయ్ ను తరలించే వాహనం ముందు బీజేపీ శ్రేణులు బైఠాయించి నిరసనకు దిగారు. బీజేపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టి హన్మకొండ కోర్టుకు తరలించనున్నారు. ఇవాళ కోర్టుకు సెలవు కావడంతో మేజిస్ట్రేట్ ఇంటి ముందు బండి సంజయ్ ను హాజరు పర్చే అవకాశం ఉందని సమాచారం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

also read:పెంబర్తి వద్ద బండి సంజయ్ ను తరలిస్తున్న కాన్వాయ్ అడ్డగింత: ఉద్రిక్తత
టెన్త్ క్లాస్ హిందీ పేపర్ లీక్ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ గా మారింది. ప్రశాంత్ అనే వ్యక్తి బండి సంజయ్ కు వాట్సాప్ లో ఈ పేపర్ ను షేర్ చేశారు పేపర్ లీక్ విషయమై బండి సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి కరీంనగర్ లో ఉన్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న రాత్రి కరీంనగర్ నుండి యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు రతరలించారు.

ఇవాళ ఉదయం బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుండి ఉమ్మడి వరంగల్ జిల్లాకు బండి సంజయ్ కు తరలించారు . బండి సంజయ్ అరెస్ట్ పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతకానితనం బయటపడిందని బీజేపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి.

బండి సంజయ్ అరెస్ట్ విషయమై బీజేపీ కేంద్ర నాయకత్వం ఆరా తీసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయమై మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో నడ్డా ఫోనులో మాట్లాడారు.