Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ పప్పుల సురేష్ ఫ్యామిలీ సూసైడ్: నలుగురు వడ్డీ వ్యాపారుల గుర్తింపు

నిజామాబాద్ జిల్లాలో సురేష్  కుటుంబం ఆత్మహత్య ఘటనకు సంబంధించి పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. సెల్‌ఫోన్ల నుండి ఆడియో తో పాటు సెల్ఫీ వీడియోను కూడా పోలీసులు సేకరించారు.

Police seized key information from Suresh cell phone
Author
Hyderabad, First Published Jan 9, 2022, 2:35 PM IST

నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన పప్పుల సురేష్ కుటుంబం suicide ఘటనపై పోలీసులు కీలక సమాచారాన్ని సేకరించారు. Suresh కుటుంబ సబ్యులు ఉపయోగించిన సెల్‌ఫోన్ల నుండి selfie వీడియోతో పాటు ఆడియో సంభాషణను పోలీసులు Nizambad పోలీసులకు పంపారు.  

సురేష్ కుటుంబాన్ని ఉమ్మడి ఆదిలాబాాద్ జిల్లాలోని నిర్మల్ కు చెందిన ఇద్దరు నిజామాబాద్ కు చెందిన ఇద్దరు ఫైనాన్షియర్లు వేధించారని  పోలీసులు గుర్తించారు. ఈ నలుగురిని ఈ విషయమై పోలీసులు విచారించనున్నారు. 

సురేష్ కుటుంబం ఈ నెల 6వ తేదీన విజయవాడకు వెళ్లింది. విజయవాడకు వెళ్లిన  సురేష్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకొంది. సురేష్ కుటుంబం ఇంటి వద్ద లేని  సమయంలో ప్రైవేట్ ఫైనాన్షియర్లు వచ్చి సురేష్ ఇంటిని స్వాధీనం చేసుకొంటామని హెచ్చరించారు. అంతేకాదు పొరుగువారికి కూడా ఈ విషయాన్ని కూడా చెప్పి వెళ్లిపోయారు. 

ఆత్మహత్య చేసుకొనే ముందు తాము ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుండి ఎదుర్కొన్న వేధింపులను సురేష్  సెల్పీ వీడియోలో పేర్కొన్నారు.  ఈ వీడియోను సమీప బంధువులకు పంపార. అయితే ఈ వీడియోను అర్ధరాత్రి పంపడంతో కూడా తాము వెంటనే గుర్తించలేకపోయినట్టుగా బంధువులు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటలకు తనకు సురేష్ నుండి సెల్ఫీ వీడియో అందిందని సురేష్ బంధువు చెప్పారు. ఈ వీడియోను చూసిన వెంటనే విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగాచెప్పారు. అయితే అప్పటికే సత్రంలో ఇద్దరు, కృష్ణా నదిలో మరో ఇద్దరు మరణించారని పోలీసులు తమకు సమాచారం ఇచ్చారన్నారు. సురేష్ తీసుకొన్న అప్పులకు 10 రూపాయాల వడ్డీని చెల్లించి ఆర్ధికంగా సురేష్ కుటుంబం నష్టపోయిందని బంధువులు చెప్పారు. అయితే సరేష్ ఎంత అప్పు తీసుకొన్నాడు, వడ్డీ వ్యాపారులు ఎంత వడ్డీని వసూలు చేశారనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. సురేష్ కు చెందిన ప్లాట్ వేలం వ్యవహరం కూడా పోలీసులు దర్యాప్తు  చేయనున్నారు.

తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన పప్పుల సురేష్‌, అతని భార్య పప్పుల శ్రీలత, కొడుకులు ఆశిష్, అఖిల్ కలిసి ఈ నెల 6వ తేదీన దుర్గమ్మ దర్శనానికి విజయవాడకు వెళ్లారు. కన్యకా పరమేశ్వరి సత్రంలో పప్పుల అఖిల్‌ పేరుతో రూమ్‌ తీసుకున్నారు. అయితే సురేష్ కొడుకు అఖిల్ పెట్రోల్ బంక్ నడిపిస్తున్నాడు. అయితే ఇందుకోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ వద్ద అప్పులు తీసుకున్నాడు. అయితే తిరిగి చెల్లించడం ఆలస్యం కావడంతో వారి నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని సమాచారం. ఈ క్రమంలోనే సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం.

సురేష్ కుటుంబం విజయవాడకు వెళ్లిన తర్వాత రోజుప్రైవేట్ పైనాన్సర్ వారు ఉంటున్న ఇంటికి చేరుకుని ఇళ్లు తమకు చెందినదని గోడలపై రాసి వెళ్లారు. అంతేకాకుండా ఈ విషయం గురించి వారు చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియజేశారు. సీజ్ చేస్తామనే హెచ్చరికలు జారీ చేశారుఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  స్థానికులు చెబుతున్నారు. ఈ విషయాలపై కూడా పోలీసులు దర్యాప్తు  చేయనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios