Asianet News TeluguAsianet News Telugu

రూ. కోటి సుపారీ: రాంప్రసాద్‌ను చంపుతుంటే చూడాలని సత్యం ఇలా

ప్రముఖ వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో  పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. కిరాయి హంతకులకు కోటి రూపాయాలను చెల్లించినట్టుగా పోలీసులు విచారణలో తేల్చారు.

police searching for three persons in ramprasad murder case
Author
Hyderabad, First Published Jul 11, 2019, 12:24 PM IST

హైదరాబాద్:  ప్రముఖ వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో  పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. కిరాయి హంతకులకు కోటి రూపాయాలను చెల్లించినట్టుగా పోలీసులు విచారణలో తేల్చారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకొన్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కోగంటి సత్యం  ఆనందం కోసం రాంప్రసాద్‌ హత్యలో శ్యామ్ కీలక పాత్ర పోషించినట్టుగా  పోలీసులు గుర్తించారు. రెండు నెలలుగా కోగంటి సత్యం, శ్యామ్‌లు హైద్రాబాద్‌లోని  పంజగుట్టలో మకాం వేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

రాంప్రసాద్‌ నూతన గృహ ప్రవేశం చేసిన తర్వాత చంపాలని ప్లాన్ వేసినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఈ నెల 6వ తేదీన పంజగుట్టలో రాంప్రసాద్‌ను హత్య చేసే సీన్‌ను చూసేందుకు సంఘటనస్థలానికి కోగంటి సత్యం చేరుకొన్నట్టుగా పోలీసులు గుర్తించారు.

హత్య జరిగిన సమయంలో  8 మంది సంఘటనస్థలంలోనే ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. హత్య జరిగిన తర్వాత  డ్రైవర్ కేకలు వేయడంతో  అంతా అక్కడి నుండి పారిపోయారు. అయితే  హత్య జరిగిన తర్వాత  పోలీసులను పక్కదోవ పట్టించేందుకు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట మీదుగా ప్రయాణించి గచ్చిబౌలిలో వాహనాన్ని వదిలేశారు దుండగులు.

రాంప్రసాద్‌ హత్యలో ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకొన్నారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  రాంప్రసాద్ హత్యకు సుఫారీ గ్యాంగ్ కు శ్యామ్  కోటి రూపాయాలను ఇచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు.

ఈ హత్యలో నలుగురు... నిందితులు పారిపోయేందుకు మరో ముగ్గురు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు. మరో వైపు  నెల రోజులుగా కోగంటి సత్యం హైద్రాబాద్‌లోనే మకాం వేసినట్టుగా పోలీసులు తేల్చారు.

 కానీ, తాను హైద్రాబాద్‌లో లేనని నమ్మించేందుకు కోగంటి సత్యం ప్రయత్నించినట్టుగా పోలీసులు గుర్తించారు.  హత్య జరిగిన రోజున కూడ కోగంటి సత్యం హైద్రాబాద్‌లోనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios