కర్నూల్:  గ్యాంగ్‌స్టర్‌ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. మాజీ మావోయిస్టు వెంకట్ రెడ్డి శేషన్నకు ఆశ్రయం కల్పించినట్టుగా పోలీసులు గుర్తించారు.

గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్‌కౌంటర్‌‌లో మరణించిన తర్వాత శేషన్న ఆచూకీ లేకుండా పోయింది.  శేషన్న కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.నయీం ఎన్‌కౌంటర్ తర్వాత శేషన్నకు మాజీ మావోయిస్టు వట్టి వెంకట్ రెడ్డి ఆశ్రయం కల్పించారని పోలీసులు అనుమానిస్తున్నారు.

కర్నూల్ జిల్లా సున్నిపెంటకు చెందిన వెంకట్ రెడ్డి గతంలో మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. నయీం ఎన్‌కౌంటర్ అయిన తర్వాత  శేషన్నను కర్నూల్ .జిల్లా బొల్లవరంలోని బంధువుల ఇంట్లో   శేషన్నకు ఆశ్రయం కల్పించారని పోలీసులు గుర్తించారు.

ఈ విషయం తెలుసుకొన్న శేషన్న అక్కడి నుండి పారిపోయారు. శేషన్నతో పాటు వెంకట్ రెడ్డి కూడ .పారిపోయారు. వెంకట్ రెడ్డి ఇంట్లో కూడ భారీగా మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారని తెలిసింది. శేషన్న వద్ద భారీ డంప్‌ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.