News Year Celebrations :  జాగ్రత్త... పట్టుబడ్డారో ఇక అంతేసంగతి..!

ప్రస్తుత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలకు సిద్దమవుతున్న యువతకు రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు జాగ్రత్తలు సూచించారు. 

Police Restrictions On New Year Celebrations In Hyderabad AKP

హైదరాబాద్ : నూతన సంవత్సర వేడుకలకు యువత సిద్దమవుతోంది. ఇప్పటికే డిసెంబర్ 31 రాత్రి పార్టీ ఎలా చేసుకోవాలో... ఎక్కడ చేసుకోవాలో ప్రెండ్స్ గ్రూప్స్ చర్చలు ప్రారంభించారు.ఇలా పార్టీలకు సిద్దమవుతున్న యువతకు పోలీసులు ముందస్తుగానే హెచ్చరిస్తున్నారు. నిబంధనలను పాటిస్తూ సేఫ్ గా పార్టీ చేసుకోవాలని... కాదని హద్దులుమీరితే కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు సూచించారు. ప్రతిఒక్కరూ భాద్యతాయుతంగా వ్యవహరించాలని... విధి నిర్వహణలో వుండే పోలీసులకు సహకరించాలని కోరారు. 

నూతన సంవత్సర వేడుకుల నేపథ్యంలో రాచకొండ కమీషనరేట్ పరిధిలోని వైన్ షాప్స్, పబ్స్, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్ హౌస్ యాజమాన్యాలు, ఈవెంట్ ఆర్గనైజర్లతో సిపి సుధీర్ బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొత్త సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత వారిపై వుందని సూచించారు. పోలీసులు జారీచేసే నిబంధనలు  తప్పనిసరిగా పాటించాలని... శాంతి భద్రతలకు భంగం కలిగేలా ఎలాంటి ఏర్పాట్లు చేయవద్దని సూచించారు. 

భారీ శబ్దాలతో కూడిన డిజేలు ఏర్పాటుచేసిన ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని రాచకొండ సిపి సూచించారు. కాదని ఎవరయినా డీజే పెడితే సీజ్ చేయడమే కాదు నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక బాణాసంచా కాల్చినా కేసులు పెడతామని ప్రజలను సిపి హెచ్చరించారు.    

Also Read  Bigg Boss 7 Telugu : పల్లవి ప్రశాంత్ సంగతి సరే... మరి వాళ్ల పరిస్థితి ఇక అంతేనా?

న్యూ ఇయర్ వేడుకల కోసం ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహించేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాచకొండ సిపి సూచించారు. పరిమిత ప్రేక్షకులతోనే ఈవెంట్స్ నిర్వహించాలని సూచించారు. నిషేదిత డ్రగ్స్ సరఫరా చేసినట్లు తెలిస్తే ఎవరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు.  డ్రగ్స్ అమ్మడమే కాదు వినియోగించడమూ నేరమేనని... వాటితో పట్టుబడితే కఠిన శిక్షలు వుంటాయని సుధీర్ బాబు హెచ్చరించారు. 

 

ఇక పబ్స్, బార్లు, వైన్ షాపులు నిర్దేశిత సమయంలోనే మూసివేయాలని సూచించారు. తాగి రోడ్లమీదకు వచ్చి ఇతరులను ఇబ్బందిపెట్టినా... పోలీసుల విధులకు ఆటంకం కలిగించినా సీరియస్ యాక్షన్ వుంటుందన్నారు. ట్రాఫిక్ సిబ్బంది వాహనాల రాకపోకలను నియంత్రించడమే కాదు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుందని అన్నారు.

నగరంలోని ప్లైఓవర్లను డిసెంబర్ 31 నైట్ మూసివేయనున్నట్లు సిపి సుధీర్ బాబు తెలిపారు. అర్ధరాత్రుల్లు యువత బైక్, కార్ రేసింగులు పెట్టుకోవద్దని... అలా చేస్తూ ఎవరైనా పట్టుబడితే కేసులు బుక్ చేస్తామని హెచ్చరించారు. మైనర్ల బైక్స్, కార్లు డ్రైవ్ చేసినా... డ్రైవింగ్ లైసెన్స్, వాహన పేపర్లు లేకుండా బయటకు వచ్చినా యజమానులపై కేసులు బుక్ చేస్తామని రాచకొండ సిపి సుధీర్ బాబు సూచించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios