నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న టాలీవుడ్ పబ్‌పై (tollywood club) శనివారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులకు దిగారు. పబ్‌లో వికృత ఛేష్టలకు పాల్పడుతోన్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో (hyderabad) పబ్‌ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ (panjagutta police) పరిధిలోని టాలీవుడ్ పబ్ తీరు మారడం లేదు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తోన్న టాలీవుడ్ పబ్‌పై (tollywood club) శనివారం వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులకు దిగారు. పబ్‌లో వికృత ఛేష్టలకు పాల్పడుతోన్న 9 మంది యువతులు, 34 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.

అలాగే పబ్‌లో సమయం దాటిన తర్వాత కూడా యువతి యువకులు అర్థనగ్న డ్యాన్స్‌లు చేస్తున్నారని సమాచారం. ఇటీవలే ఈ పబ్‌పై ఎక్సైజ్, పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి నోటీసులు జారీ చేశారు. అయితే గతంలోనూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా వుంది టాలీవుడ్ పబ్. ఇటీవలే పబ్‌కు వచ్చిన భార్యాభర్తలపై పబ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు దాడి చేయడంతో కొంత కాలం సీజ్ చేశారు పంజాగుట్ట పోలీసులు.