Asianet News Telugu

బర్త్‌డే పేరుతో రేవ్‌ పార్టీ: లాక్‌డౌన్ ఆంక్షలు బేఖాతరు.. మద్యం మత్తులో యువ‌తీ యువ‌కుల చిందులు

హైదరాబాద్ శివారు కడ్తాల్‌లో అర్థరాత్రి బర్త్‌డే పార్టీ పేరిట రూల్స్ బ్రేక్ చేశారు. ఓ రిసార్ట్‌లో మద్యం మత్తులో చిందులేశారు యువతీ, యువకులు. దాదాపు 50 మంది ఈ విందులో పాల్గొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడంపై రంగంలోకి దిగారు పోలీసులు

police raids on rave party at ranga reddy district ksp
Author
Hyderabad, First Published Jun 13, 2021, 2:26 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హైదరాబాద్ శివారు కడ్తాల్‌లో అర్థరాత్రి బర్త్‌డే పార్టీ పేరిట రూల్స్ బ్రేక్ చేశారు. ఓ రిసార్ట్‌లో మద్యం మత్తులో చిందులేశారు యువతీ, యువకులు. దాదాపు 50 మంది ఈ విందులో పాల్గొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడంపై రంగంలోకి దిగారు పోలీసులు. ముగ్గురు నిర్వాహకుల్ని అరెస్ట్ చేసి భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే డీజేని సీజ్ చేశారు. 

Also Read:రేవ్ పార్టీకి కొడుకుతో పాటు హాజరైన మహిళా కానిస్టేబుల్: సస్పెన్షన్

రంగారెడ్డి జిల్లా కడ్తాల్ లోని ఓ ఫామ్ హౌస్‎లో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం అందింది. శివారు ప్రాంతంలో ఉన్న భరత్‌ పాం హౌస్‌లో సాయంత్రం సమయంలో సుమారు 70 మంది యువతి, యువకులు చేరుకున్నారు. బర్త్‌ డే పార్టీ పేరుతో విచ్చలవిడిగా నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. హైదరాబాద్‌కు చెందిన వరుణ్‌… భరత్‌ ఫాం హౌస్‌లో బర్త్‌ డే పార్టీ నిర్వహించాడు. ఆర్గనైజర్లుగా జాశన్‌ఖాన్‌, అన్వేష్‌ అన్నీ తామై చూసుకున్నట్లుగా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios