హైదరాబాద్‌లో విదేశీ విద్యార్ధుల ఇళ్లపై పోలీసులు సోదాలు నిర్వహించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, టోలిచౌకీ, ఆసిఫ్‌‌నగర్‌తో సహా మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులకు దిగారు. నైజిరియన్లే టార్గెట్‌గా ఈ సోదాలు జరిగినట్లుగా తెలుస్తోంది. దాడుల్లో భాగంగా వీసా గడువు ముగిసినప్పటికీ ఇంకా భారత్‌లో ఉంటున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 200 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు.