Asianet News TeluguAsianet News Telugu

మహంకాళి ఆలయంలో తల: మొండెం దొరికిన ఇంటి యజమానిని విచారిస్తున్న పోలీసులు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్ నగర్లో మహంకాళి ఆలయం వద్ద జయేందర్ తల కేసులో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు. జయేందర్ మొండెం లభించిన ఇంటి యజమానిని పోలీసులు విచారిస్తున్నారు. మరో వైపు దొరికిన డెడ్‌బాడీకి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నారు.


 

Police  questioing Builiding owner in jayender naik murder case
Author
Hyderabad, First Published Jan 14, 2022, 3:54 PM IST


హైదరాబాద్: ఉమ్మడి Nalgonda జిల్లాలోని చింతపల్లి మండలం విరాట్‌నగర్‌లోని మహంకాళి ఆలయం వద్ద jayendar naik నాయక్ అనే యువకుడి headకేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో జయేందర్ నాయక్ మొండెన్ని రంగారెడ్డి జిల్లాలోని కమ్మగూడెంలో గుర్తించారు. గత కొంతకాలంగా జయేందర్ నాయక్ తుర్క యంజాల్, ఇబ్రహీంపట్నంల వద్ద ఉన్న దేవాలయాల్లో బిక్షాటన చేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఇటీవలనే జయేందర్ నాయక్ తల్లిదండ్రులు వచ్చి అతడిని ఇంటికి రావాలని కూడా కోరారు. అయితే జయేందర్ నాయక్ మాత్రం నిరాకరించారు.

అయితే మూడు రోజుల క్రితం జైయేందర్ నాయక్ తలను Virat nagar వద్ద ఉన్న Mahankali temple  గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అయితే తుర్క యంజాల్ కు సమీపంలోని కమ్మగూడెం వద్ద ఉన్న నిర్మాణంలో ఉన్న భవనం ఆవరణలో జయేందర్  నాయక్ మొండెం లభ్యమైంది. ఈ ఇంట్లో దొరికిన దుస్తులు, వస్తువుల ఆధారంగా ఈ మొండెం జయేందర్ నాయక్ గా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మృతదేహనికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తే ఈ డెడ్‌బాడీ జయేందర్ నాయక్ దా కాదా అనే విషయమై తేలనుంది. ఈ విషయమై పోలీసులు డిఎన్ఏ టెస్ట్ కోసం ఈ డెడ్‌బాడీ నమూనాలను పంపనున్నారు. 

ఇదిలా ఉంటే జయేందర్ దిగా అనుమానిస్తున్న డెడ్‌బాడీ లభ్యమైన ఇంటి యజమానిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.  జయేందర్ నాయక్ ను హత్య చేశారా లేక నరబలి ఇచ్చారా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయేందర్ నాయక్ ను నరబలి ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.

కమ్మగూడలో నిర్మాణంలో ఉన్న భవనం నుండి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా పోలీసులు ఈ భవనంలో తనిఖీలు చేస్తే మొండెం లభ్యమైంది. మొండెం ఉబ్బి దుర్వాసన వస్తుంది.

ఈ మొండెం ఉన్న ఇంటి నిర్మాణం కొన్నాళ్లుగా నిలిచిపోయింది. దీంతో అక్కడ ఉన్న ఇటుకల మధ్య ఎవరికీ అనుమానం రాకుండా మొండెంను పెట్టారు. ఈ ఘాతుకాన్ని పాల్పడ్డ నిందితులను పట్టుకునేందుకు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

 ఇదిలా ఉంటే జయేందర్ నాయక్ స్వగ్రామం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పాలకవీడు మండలం శూన్యపహాడ్‌ గ్రామం..మతిస్థిమితం లేక ఐదేళ్ల క్రితం జయేందర్ నాయక్ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఈ నెల 5వ తేదీ నుంచి జయేందర్​ తుర్కయంజాల్​లో కనిపించలేదని స్థానికులు తెలిపారు. 

అయితే జయేందర్ నాయక్ ను అత్యంత దారుణంగా హత్య చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయనే వషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతుంది. అయితే గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  తన కొడుకును దారుణంగా హత్య చేసిన నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చే జయేందర్ నాయక్ మతిస్థిమితం కోల్పోయి ఐదేళ్ల క్రితం గ్రామం వదిలి వచ్చాడని పేరేంట్స్ చెబుతున్నారు. తుర్క యంజాల్ లో ఉన్నాడని తెలుసుకొని అప్పుడప్పుడు అతడిని చూసి వెళ్లేవారమని పేరేంట్స్  గుర్తు చేసుకొంటున్నారు. తన కూతురు వివాహం కోసం కూడా రావాలని జయేందర్ నాయక్ ను కోరినా కూడా అతను రాలేదని తండ్రి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios