తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. వీరికి న్యాయమూర్తి ఈ నెల 17 వరకు రిమాండ్ విధించడంతో పోలీసులు వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు. 

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసులో ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే మనవడితో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. ఇద్దరికీ ఈ నెల 17 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో వారిని జువైనల్ హోమ్‌కు తరలించారు పోలీసులు. 

మరోవైపు నిందితులు బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా జువైనల్ కోర్టులో ఐదుగురు మైనర్లు బెయిల్ పిటిషన్ వేశారు. ఇక అత్యాచార ఘటనలో ఏ 1 నిందితుడిగా వున్న సాబుద్ధీన్‌ను పోలీసుల కస్టడీకి అనుమతించేందుకు నాంపల్లి కోర్టు అంగీకరించింది. మూడు రోజుల పాటు సాబుద్దీన్‌ను పోలీసులు తమ కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. రేపు సాబుద్దీన్‌ను తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు పోలీసులు. 

Also Read:ఆ వాహనాల యజమానులు ఎవరో చెప్పాలి: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై రేవంత్ రెడ్డి

మరోవైపు బాలికపై అత్యాచారం కేసులో కీలకంగా మారిన ఇన్నోవాను వక్ఫ్‌బోర్డ్ ఛైర్మన్‌దిగా తేల్చారు పోలీసులు. దీనాజ్ పేరుతో ఇన్నోవాను కొన్నట్లుగా గుర్తించారు. ఏడాదిన్నరగా టీఆర్ నెంబర్ ప్లేట్‌పైనే తిరుగుతున్నట్లుగా గుర్తించారు. అత్యాచారం జరిగిన సమయంలోనూ నెంబర్ ప్లేట్ లేదు. కారుపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్ కూడా వున్నట్లు ఫోటోల్లో కనిపించింది. అయితే అత్యాచారం జరిగిన తర్వాత ఆ స్టిక్కర్‌ను తొలగించారు. 

మరోవైపు.. Jubilee hills gang rape ఘటనలో తన మనమడు ఉన్నాడని దుష్ఫ్రచారం చేశారని తెలంగాణ హోంమంత్రి Mahmood Ali చెప్పారు. గ్యాంగ్ రేప్ ఘటన చాలా బాధాకరమని... ఈ తరహా ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ పోలీసులు ఈ కేసును సమర్ధవంతంగా విచారణ చేస్తున్నారని మహమూద్ అలీ ప్రశంసించారు. బుధవారం హోం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... పిల్లలపై పేరేంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి కోరారు. మహిళలపై దాడులు, అత్యాచారాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని మహమూద్ అలీ పేర్కొన్నారు.