హైదరాబాద్: సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం నాడు   ఆర్టీసీ జేఎసీ నిర్వహించతలపెట్టిన సకల జనుల సమరభేరీ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో ఆర్టీసీ జేఎసీ నేతలు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

సమ్మెకు మద్దతుగా సరూర్‌నగర్ స్టేడియంలో బుధవారం నాడు ఆర్టీసీ జేఎసీ నేతలు సకల జనుల సమరభేరీ సభను నిర్వహించనున్నారు.. ఈ సభకు హైద్రాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ సభకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ,సీపీఐ, సీపీఎంలు మద్దతు ప్రకటించాయి.

ఈ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకోవాలని ఆర్టీసీ జేఎసీ నేతలు నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు మంగళవారం నాడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేయనుంది. 

ఈ నెల 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్నారు. 26 డిమాండ్లతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు.ఈ డిమాండ్లలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు 26 డిమాండ్లను ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వం ముందు ఉంచారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పాటు ఆర్టీసీ కార్మికులకు జీతాల చెల్లింపు అంశంతో పాటు సరూర్‌నగర్ స్టేడియంలో సకల జనుల సకల బేరీ సభకు అనుమతి విషయమై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ పై మైకోర్టు విచారణ చేయనుంది.

ఆర్టీసీ సమ్మెపై సోమవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు కొంత అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

బుధవారం నాడు ఆర్టీసీ సమ్మెపై విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ రావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలతో ఇవాళ హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ సమయంలో అడ్వకేట్ జనరల్ హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలను విన్పించే అవకాశం ఉంది.

ఆర్టీసీ సమ్మె చట్టబద్దం కాదని ప్రభుత్వం హైకోర్టుకు తేల్చి చెప్పింది.అయితే సమ్మె చట్టబద్దమైతే ఎలాంటి చర్యలు తీసుకొన్నారో చెప్పాలని ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయమై తెలంగాణ ప్రభుత్వాన్ని సోమవారం నాడు హైకోర్టు ప్రశ్నించింది.

ఆర్టీసీ సమ్మె విషయంలో తలంగాణ హైకోర్టు ఇవాళ కీలకమైన తీర్పును ఇచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ జేఎసీ నేతలు భావిస్తున్నారు. సకల  జనుల సమరభేరీ సభకు కూడ పోలీసులు అనుమతిని నిరాకరించారు. ఈ విషయమై కోర్టు ఇవాళే స్పష్టత ఇవ్వనుంది.