పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. జర్నలిస్టును దూషించిన కేసులో ఎమ్మెల్యేపై ఇటీవల అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చారు.

కాగా, కబ్జాలపై వార్త రాసినందుకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విలేకరిని దూషించిన ఘటన కలకలం రేపింది. నిన్న అమీన్ పూర్ పోలీస్టేషన్‌లో టీయూడబ్ల్యూజే, ఐజేయు సంఘం ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.