Asianet News TeluguAsianet News Telugu

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు చుక్కెదురు

డిసెంబర్ 31న హైదరాబాద్ లో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. 31 రాత్రి జరిపిన డ్రంక్ డ్రైవ్ లో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులకు  నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అయితే బ్రీత్ అనలైజర్ లో 77పాయింట్లు చూపించడంతో ఆయన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 
 

Police irked in drunk and drive case in Hyderabad
Author
Hyderabad, First Published Jan 2, 2019, 4:02 PM IST

హైదరాబాద్: డిసెంబర్ 31న హైదరాబాద్ లో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. 31 రాత్రి జరిపిన డ్రంక్ డ్రైవ్ లో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులకు  నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తిని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు. అయితే బ్రీత్ అనలైజర్ లో 77పాయింట్లు చూపించడంతో ఆయన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. 

దీంతో కోపోద్రిక్తుడైన నాగభూషణ్ రెడ్డి మద్యం సేవించకుండా కౌంట్ ఎలా చూపుతుందంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. అయినా పోలీసులు వాహనాన్ని ఇవ్వకపోవడంతో వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకున్నాడు నాగభూషన్ రెడ్డి. 

అయితే ఆ రక్త పరీక్షల్లో నాగభూషణ్ రెడ్డి మద్యం సేవించలేదని తేలింది. గాంధీ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ ను పోలీసులకు అందజేశాడు నాగభూషణ్ రెడ్డి. బ్రీత్ అనలైజర్ మిషన్ లో లోపాలున్నాయని సరిచూసుకోవాలంటూ హితవు పలికాడు. అయితే పోలీసులు మాత్రం వైద్యులను తప్పుబడుతున్నారు. తప్పుడు రిపోర్ట్ ఇచ్చారంటూ ఆరోపిస్తున్నారు.  

గతేడాదిలో ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. శాలిబండకు చెందిన సయ్యద్ జహంగీర్ ఖాద్రి అనే 35 ఏళ్ల యువకుడుకి గతేడాది ఆగష్టు 24న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. నోట్లో బ్రీత్ అనలైజర్ పెట్టారు. రీడింగ్ 43 పాయింట్లు వచ్చింది. అయితే తాను తాగలేదని వాసన చూడాలంటూ నోరు విప్పాడు. అయినా పోలీసులు వినలేదు. మిషన్ అబద్ధం చెప్పదు అంటూ వీరంగం వేశారు. 

టూ వీలర్ సీజ్ చేశారు. పోలీసుల వైఖరితో దెబ్బతిన్న ఖాద్రి వెనక్కి తగ్గలేదు. తాగలేదని అక్కడే బైఠాయించాడు. గొడవకి దిగాడు. అయినా మన పోలీసులు వినకపోవడంతో ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. వైద్య పరీక్షల్లో ఖాద్రీ మద్యం సేవించలేదని తేలింది. 

తాను మద్యం సేవించలేదని వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అక్కడ పోలీసులపైనే కేసు పెట్టాడు. మద్యం తాగకపోయినా కేసు పెట్టారని కంప్లయింట్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios