మహబూబాబాద్‌లో రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు: మృతదేహలకు పోస్టు మార్టం పూర్తి

మహబూబాబాద్ రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురి మృతదేహలకు పోస్టుమార్టం పూర్తైంది.  డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అందించారు

Police investigates  on  Mahabubabad  Road accident

మహబూబాబాద్:  జిల్లాలోని  కురవి మండలం అయ్యగారిపల్లి  సమీపంలో  జరిగిన ప్రమాదంలో  మృతి చెందిన  ముగ్గురి మృతదేహలపై పోస్టు మార్టం పూర్తైంది.  మృతదేహలను  కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు.  అయ్యగారిపల్లి వద్ద  గ్రానైట్  లారీ ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  మహబూబాబాద్ జిల్లాలోని  చిన్నగూడూరు మండలం మంగోలిగూడెం కూలీలు ఆటోలో  కురవి వైపునకు వెళ్తున్న సమయంలో  గ్రానైట్  లోడ్ తో వెళ్తున్న లారీ  నుండి రాళ్లు పడి  ముగ్గురు మృతి చెందారు.

 కురవి వైపునుండి మరిపెడ  వైపునకు   గ్రానైట్ లోడ్ తో  లారీ  వెళ్తుంది. ఈ సమయంలో  ఎదురుగా ఆటో రావడంతో  ఒక్కసారిగా  రావడంతో   లారీ డ్రైవర్  సడెన్ బ్రేక్   వేశాడు. దీంతో   లారీపై ఉన్న  రాళ్లు ఆటోపై పడ్డాయి. ఆటోలో  ప్రయానీస్తున్న  ఎనిమిది మందిలో  ముగ్గురు  మృతి చెందారు. సంఘటన స్థలంలోనే  ఇద్దరు మృతి చెందారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో  మరొకరు మృతి చెందారు. మృతులను  శ్రీకాంత్, సుమన్, నవీన్ లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో గాయపడిన  ఐదుగురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  వీరి  ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని  అధికారులు  చెబుతున్నారు. సంఘటనస్థలాన్ని  అధికారులు పరిశీలించారు. లారీపై  గ్రానైట్ రాళ్లను గొలుసులు కట్టకుండా  తరలించడం వల్ల ప్రమాదరం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

also read:హైద్రాబాద్‌లో విషాదం: టిఫిన్ కోసం నిలబడ్డ వారిని ఢీకొన్న కారు, ఇద్దరు మృతి

గ్రానైట్ క్వారీ యజమాను నిర్లష్యంగా  గ్రానైట్ ను తరలించారా లేక లారీ డ్రైవర్ నిర్లక్షం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  ఇదిలా ఉంటే  రానున్న  రోజుల్లో ఈ తరహ ఘటనలు  చోటు  చేసుకోకుండా  ఉండేందుకు గాను  చర్యలు తీసుకోవాలని  స్థానికులు  కోరుతున్నారు. మరో వైపు  మృతుల కుటుంబాలకు  న్యాయం చేయాలని  బాధిత కుటుంబ సభ్యులు  డిమాండ్  చేస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios