మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై వేటు.. పోలీసు శాఖ సర్వీసు నుంచి తొలగింపు..

మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై వేటు పడింది. నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ  తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Police inspector nageshwar rao Terminated from police service

మారేడ్ పల్లి మాజీ సీఐ నాగేశ్వరరావుపై వేటు పడింది. నాగేశ్వరరావును సర్వీసు నుంచి తొలగిస్తూ  తెలంగాణ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వనస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి, అత్యాచారానికి పాల్పడిన కేసులో నాగేశ్వరరావు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. అలాగే పలు అక్రమాలకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే నాగేశ్వరరావును పోలీసు శాఖ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. 

అయితే నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించాలని కోరుతూ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్.. పోలీసు రిక్రూట్మెంట్ అథారిటీకి లేఖ రాశారు. సీవీ ఆనంద్ లేఖను పరిగణలోకి తీసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ అథారిటీ నాగేశ్వరరావును సర్వీస్ నుంచి తొలగించింది. అదే విధంగా హైదరాబాద్ పరిధిలో 39 మందిని పోలీసు శాఖ సర్వీసు నుంచి తొలగించారు. 

నస్థలిపురంలో మహిళను తుపాకీతో బెదిరించి, అత్యాచారానికి పాల్పడిన కేసులో నాగేశ్వరరావు  కొద్ది రోజుల పాటు జైలులో ఉన్నారు. గత నెలలో అతని హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తుతో పాటు.. రెండు నెలలపాటు ప్రతిరోజు విచారణ అధికారి ఎదుట హాజరవ్వాలని హైకోర్టు ఆదేశించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios