నలుగురు పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఓ వృద్ధురాలి పాడె మోసి.. ఇంకా సమాజంలో మానవత్వం ఉందని నిరూపించారు. 

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. ఈ సమయంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబసభ్యులు కూడా ముందుకు రావడం లేదు. అలాంటి సమయంలో... నలుగురు పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఓ వృద్ధురాలి పాడె మోసి.. ఇంకా సమాజంలో మానవత్వం ఉందని నిరూపించారు.

ఈ ఘటన వనపర్తి జిల్లా మదనాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శకుంతలమ్మ (80) అనారోగ్యానికి గురై శుక్రవారం కన్నుమూసింది.

దహన సంస్కారాలకు వరుసకు కూతురైన లక్ష్మీ, ఆమె భర్త బంధువులకు ఎంత వేడుకున్నా ఎవరి గుండె కరగలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిరుపాజి అంత్యక్రియలు తామే నిర్వహిస్తామని ముందుకొచ్చారు. దహన సంస్కారాలకు కావాల్సిన సామగ్రిని సమకూర్చారు. ఎస్‌ఐ, ట్రెయినీ ఎస్‌ఐ రాజశేఖర్, ఐదుగురు కానిస్టేబుళ్లు పాడెను మోసి..అంత్యక్రియలు నిర్వహించారు. పోలీస్‌ సిబ్బంది కురుమయ్యగౌడ్, రవి, శివకుమార్‌రెడ్డి, స్వాములు, కలాం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.