ఫేమస్ స్టార్ హోటల్లో రిసెప్షనిస్టు ఉద్యోగం... లక్షల్లో జీతం ఎవరు మాత్రం వద్దు అనుకుంటారు ఇలాంటి ఉద్యోగం. అందుకే చాలా మంది యువతులు ఈ ఉద్యోగం దక్కించుకోవాలని అనుకున్నారు. వారి అవకాశాన్ని తనకు అనుకూలంగా చేసుకున్నాడు ఓ కేటుగాడు. అమ్మాయిలను మోసం చేసి వారి నగ్న ఫోటోలను సేకరించాడు. తర్వాత ఆఫోటోలను చూపించి వారిని బెదిరించడం మొదలుపెట్టాడు. చివరకు పోలీసులకు చిక్కాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...చెన్నైకి చెందిన రాజు అలియాస్ ప్రదీప్(33) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిరుద్యోగ యువతులకు వల వేసేందుకు హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ పేరుతో రిసెప్షనిస్టులు కావాలంటూ క్వికర్ డాట్ కామ్ లో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనలో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా రాజును సంప్రదించే యువతులను ప్రదీప్ పేరుతో మోసగించేవాడు.  తమ హోటల్ హెచ్ఆర్ అర్చన వాట్సాప్ లో ఇంటర్వ్యూ చేస్తారని నమ్మించేవాడు.

రిసెప్షనిస్ట్ అంటే అందంగా ఉండాలని వాట్సాప్ లో వాళ్ల ఫోటోలు పంపమని  అడిగేవాడు. వాళ్లు అందంగా ఉంటే..  మీ ఎద భాగం, వెనకభాగం నగ్న చిత్రాలు, వీడియోలు పంపండి అని ,చెప్పేవాడు. ఇలా 16 రాష్ట్రాలకు చెందిన 600మంది యువతులను నుంచి 2వేల నగ్న ఫోటోలను, వీడియోలను సేకరించాడు.తర్వాత వాళ్లని ఆ ఫోటోలు చూపించి బెదిరించడం మొదలుపెట్టేవాడు.  బాధితుల్లో మియాపూర్ కి చెందిన ఓ యువతి కూడా ఉంది. ఆమె మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

నిందితుడు చెన్నైకి చెందిన ప్రదీప్ గా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్ లో 2వేల నగ్న చిత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడికి భార్య, ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నారు. కాగా... తన కామ వాంఛ తీర్చుకోవడానికే ఇలా యువతనుల ఉద్యోగం పేరిట మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.