Asianet News TeluguAsianet News Telugu

పప్పుల సురేష్ ఫ్యామిలీ సూసైడ్: ఆ ఇద్దరు అందుకే కృష్ణా నదిలో దూకారు

విజయవాడలో నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. ఈ కేసులో పోలీసులు కీలక విషయాలను సేకరించారు. 

police gathered key information on Suresh family Suicide case
Author
Hyderabad, First Published Jan 9, 2022, 5:14 PM IST

హైదరాబాద్:  నిజామాబాద్ కు చెందిన పప్పుల suresh ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకొన్న విషయంలో సంచలన విషయాలు వెలుగు  చూశాయి.వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగానే పప్పుల సురేష్  కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. విజయవాడలోనే సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసకొంది.

Viajayawada లోని కన్యకాపరమేశ్వరి సత్రంలో ఇద్దరు, కృష్ణానదిలో దూకి మరో ఇద్దరు Suicide పాల్పడ్డారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు సురేష్ తన బంధువులకు సెల్ఫీ వీడియోను పంపారు.  సూసైడ్ నోట్ ను కూడా పంపారు. వీటి ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

వడ్డీ వ్యాపారుల వేధింపుల కారణంగా సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు సురేష్ ఆయన భార్య ఇద్దరు కొడుకులు ఇన్సులిన్ తీసుకొని ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.  నలుగురు కూడా ఇన్సులిన్ తీసుకొన్నారు. అయితే ఇన్సులిన్ తీసుకొన్న తర్వాత కూడా పప్పుల సురేష్ తో పాటు ఆయన కొడుకు అఖిల్ స్పృహలోకి వచ్చారు.  అయితే ఇన్సులిన్ తో లాభం లేదనుకొని సురేష్, అఖిల్ కృష్ణా నదిలో దూకితేనే చనిపోతామని భావించారు. తాము బస చేసిన సత్రం నుండి బయటకు వచ్చి కృష్ణా నదిలో దూకినట్టుగా పోలీసులు చెప్పారు.

పప్పుల సురేష్ కుటుంబాన్ని వేధించిన కేసులో నలుగురు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన వినీత, చంద్రశేఖర్ తో పాటు నిజామాబాద్ కు చెందిన ఇద్దరు నేతలు కూడా ఉన్నారని సురేష్ బంధువులు ఆరోపిస్తున్నారు.

సురేష్ కుటుంబానికి పెట్రోల్ బంకు, మెడికల్ వ్యాపారాలు ఉన్నాయి. సురేష్ తనయుడు పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసే సమయంలో ప్రైవేట్ ఫైనాన్షియర్ల వద్ద డబ్బులు తీసుకొన్నారని సమాచారం.అయితే ప్రైవేట్ ఫైనాన్షియర్లు రూ. 10 వడ్డీని వసూలు చేశారని సురేష్ బంధువులు ఆరోపించారు. ఈ వడ్డీ కారణంగానే సురేష్ కుటుంబం డబ్బులు చెల్లించలేదని చెబుతున్నారు.సురేష్ కుటుంబం ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సురేష్ కుటుంబం ఈ నెల 6వ తేదీన విజయవాడకు వెళ్లింది. విజయవాడకు వెళ్లిన  సురేష్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకొంది. సురేష్ కుటుంబం ఇంటి వద్ద లేని  సమయంలో ప్రైవేట్ ఫైనాన్షియర్లు వచ్చి సురేష్ ఇంటిని స్వాధీనం చేసుకొంటామని హెచ్చరించారు. అంతేకాదు పొరుగువారికి కూడా ఈ విషయాన్ని కూడా చెప్పి వెళ్లిపోయారు. 

ఆత్మహత్య చేసుకొనే ముందు తాము ప్రైవేట్ ఫైనాన్షియర్ల నుండి ఎదుర్కొన్న వేధింపులను సురేష్  సెల్పీ వీడియోలో పేర్కొన్నారు.  ఈ వీడియోను సమీప బంధువులకు పంపార. అయితే ఈ వీడియోను అర్ధరాత్రి పంపడంతో కూడా తాము వెంటనే గుర్తించలేకపోయినట్టుగా బంధువులు తెలిపారు. అర్ధరాత్రి 2 గంటలకు తనకు సురేష్ నుండి సెల్ఫీ వీడియో అందిందని సురేష్ బంధువు చెప్పారు. ఈ వీడియోను చూసిన వెంటనే విజయవాడ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగాచెప్పారు. అయితే సరేష్ ఎంత అప్పు తీసుకొన్నాడు, వడ్డీ వ్యాపారులు ఎంత వడ్డీని వసూలు చేశారనే విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. సురేష్ కు చెందిన ప్లాట్ వేలం వ్యవహరం కూడా పోలీసులు దర్యాప్తు  చేయనున్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios