హైదరాబాద్: హైద్రాబాద్ ఘట్ కేసర్ మండలం అంకుషాపూర్ రైల్వేట్రాక్ పై ఓ మహిళ మృతదేహం  కలకలం సృష్టిస్తోంది. డెడ్ బాడీని గుర్తు పట్టకుండా ఉండేందుకు గాను ముఖాన్ని దగ్ధం చేశారు.

మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.  వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడికి తీసుకొచ్చి వేశారా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఘట్ కేసర్ అంకుషాపూర్ గ్రామ సమీపంలోని హెచ్‌పీసీఎల్ రైల్వే ట్రాక్ వద్ద మహిళ డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మహిళ హత్య జరిగిన 72 గంటలు జరిగి ఉంటుందని  పోలీసులు అభిప్రాయపడుతున్నారు. సంఘటన స్థలంలో పోలీసులు క్లూస్ టీమ్ ను రప్పించారు.
సోమవారంనాడు రాత్రి ఈ ప్రాంతంలో మహిళ డెడ్ బాడీని గుర్తించిన స్తానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అంకుషాపూర్ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుంది. దీంతో నిందితులు ఈ ప్రాంతాన్ని ఎంచుకొన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన మహిళ 30 నుండి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని  పోలీసులు చెప్పారు.