నగరంలోని పాతబస్తీ సౌత్‌జోన్ లో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన డిటోనేటర్ల తయారీ కేంద్రాన్ని గుర్తించారు. కరీంనగర్, హైద్రాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో  ఈ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. 


హైదరాబాద్: నగరంలోని పాతబస్తీ సౌత్‌జోన్ లో టాస్క్ ఫోర్స్‌ పోలీసులు అక్రమంగా నిల్వ ఉంచిన డిటోనేటర్ల తయారీ కేంద్రాన్ని గుర్తించారు. కరీంనగర్, హైద్రాబాద్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ తయారీ కేంద్రాన్ని గుర్తించారు. 

నాలుగు రోజుల క్రితం కరీంనగర్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని విచారిస్తే డిటోనేటర్ల వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే.కరీంనగర్ పోలీసులు విచారణలో హైద్రాబాద్ లో డొంక బయటపడింది. 

కరీంనగర్ పోలీసుల విచారణలో నిందితుడు వెల్లడించిన సమాచారం ఆధారంగా కరీంనగర్, హైద్రాబాద్ పోలీసులు గురువారం నాడు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో డిటోనేటర్ల కేంద్రాన్ని గుర్తించారు. హైద్రాబాద్ లో సుమారు వెయ్యి కిలోల పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. 

పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. పేలుడు పదార్ధాలను మావోయిస్టులకు అక్రమంగా రవాణా చేస్తున్నారా అనే కోణంలో కూడ పోలీసులు విచారణ చేస్తున్నారు.ఇప్పటివరకు ఎవరెవరికి ఈ పేలుడు పదార్ధాలు సరఫరా చేశారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.