హరిహరకృష్ణ ఫోన్ డేటా డిలీట్: 8 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్

అబ్దుల్లాపూర్ మెట్  వద్ద జరిగిన నవీన్ హత్య  కేసును లోతుగా దర్యాప్తు  చేయనున్నారు పోలీసులు. నిందితుడు  హరిహరకృష్ణను కస్టడీ కోరుతూ  పోలీసులు  పిటిషన్ దాఖలు  చేశారు. 

Police Files  Custody  Petition  In Ranga Reddy  in  Naveen Murder case


హైదరాబాద్: నగర  శివారులోని అబ్దుల్లాపూర్ మెట్  వద్ద  నవీన్ ను హత్య  చేసిన  నిందితుడు  హరిహరకృష్ణను ఎనిమిది రోజులు  కస్టడీ కోరుతూ  పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో  మంగళవారం నాడు  పిటిషన్  దాఖలు  చేశారు.  ఈ పిటిషన్ పై ఇవాళ   కూడా వాదనలు సాగాయి.  రేపు  ఈ విషయమై  రంగారెడ్డి  జిల్లా కోర్టు తీర్పును  వెల్లడించే అవకాశం ఉంది.

గత నెల  17వ తేదీన  తన స్నేహితుడు  నవీన్ ను  అత్యంత దారుణంగా  హరిహరకృష్ణ  హత్య చేశాడు.  హత్య చేసిన వారం రోజుల తర్వాత  అబ్దుల్లాపూర్ మెట్  పోలీసులకు  హరిహరకృష్ణ లొంగిపోయాడు.

నవీన్ హత్య  కేసును అబ్దుల్లాపూర్ మెట్  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. ఇప్పటికే  సుమారు  50కిపైగా  సీసీటీవీ పుటేజీలను పోలీసులు పరిశీలించారు.  హత్య చేసిన తర్వాత  హరిహరకృష్ణ ఎక్కడికి వెళ్లాడు, ఎవరెవరిని కలిశారనే  విషయమై  పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఈ హత్య  కేసు విషయమై   హరిహరకృష్ణ నుండి  సమాచారం  సేకరించడంతో   సీన్ రీకన్ స్ట్రక్షన్  చేయాల్సిన అవసరం ఉందని  పోలీసులు  కస్టడీ పిటిషన్ లో  పేర్కొన్నారు.  హరిహరకృష్ణను  ఎనిమిది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరారు.  పోన్ డేటాను  హరిహరకృష్ణ డిలీట్  చేసినట్టుగా  పోలీసులు  కస్టడీ పిటిషన్ లో  పేర్కొన్నారు.  అంతేకాదు  నవీన్ ఫోన్  ఇంకా లభ్యం కాని విషయాన్ని పోలీసుల తరపు న్యాయవాది కోర్టులో  వాదించారు. ఈ ఫోన్  విషయం కూడా  హరిహరకృష్ణకు తెలిసి ఉంటుందని  పోలీసులు అనుమానిస్తున్నారు.  

ఇంటర్మీడియట్ చదివే రోజుల నుండే   నవీన్, హరిహరకృష్ణ లు స్నేహితులు. వీరిద్దరూ  ఒకే కాలేజీలో  చదువుకున్నారు. ఇంటర్ లో చదువుకునే రోజుల్లోనే  పరిచయం ఉన్న అమ్మాయితో  వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఒకరి తర్వాత  ఒకరు ఈ అమ్మాయి ప్రేమలో  పడ్డారు.ఈ ప్రేమ అంశమే  వీరిద్దరి మధ్య అగాధాన్ని పెంచింది.   ఈ విషయమై నవీన్ పై   హరిహరకృష్ణ   అక్కసును పెంచుకున్నాడు. నవీన్ ను  హత్య చేస్తే  లవర్ తనకు దక్కుతుందని  హరిహరకృష్ణ భావించాడు.  దీంతో  నవీన్ ను హైద్రాబాద్ కు రప్పించి హత్య  చేసినట్టుగా  పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.   ఈ విషయాన్ని హరిహరకృష్ణ రిమాండ్ రిపోర్టులో  పోలీసలుు తెలిపారు.

also read:రక్తపు దుస్తులతో స్నేహితుడి వద్దకు హరిహరకృష్ణ: నవీన్ హత్య కేసులో కీలక విషయాలు

 మూడు నెలల క్రితమే  నవీన్ ను హత్య చేయాలని  హరిహరకృష్ణ ప్లాన్  చేశాడు.  ఇందుకు గాను రెండు నెలల క్రితం మలక్ పేట సూపర్ మార్కెట్ లో  కత్తిని కొనుగోలు  చేశాడు.ఈ నెల 17న అంబర్ పేటలో  మద్యం కొనుగోలు  చేశాడు. ఔటర్ రింగ్  రోడ్డు సమీపంలోని  నిర్మానుష్య ప్రాంతంలో   నవీన్,  హరిహరకృష్ణ  మద్యం తాగారు.   మద్యం తాగిన  తర్వాత   లవర్ విషయమై  వీరిద్దరి మధ్య  గొడవ జరిగింది.  ఈ విషయమై  హరిహరకృష్ణ నవీన్ గొంతు  నులిమి చంపాడు. ఆ తర్వాత  నవీన్ శరీ బాగాలను  కోసి బ్యాగులో  వేసుకొని బ్రహ్మణపల్లి శివారులో  పారేశాడు. ఈ హత్య  చేసిన తర్వాత  బ్రహ్మణపల్లిలోని తన స్నేహితుడు హసన్  ఇంటికి  హరిహరకృష్ణ వెళ్లినట్టుగా  పోలీసులు  రిమాండ్  రిపోర్టులో  పేర్కొన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios