Asianet News TeluguAsianet News Telugu

పాల్వంచ సూసైడ్ కేసులో ట్విస్ట్: ఎమ్మెల్యే వనమా తనయుడు రాఘవేంద్రపై కేసు

పాల్వంచలోని తూర్పు బజారులో  రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్న ఘటనలో  కొత్త గూడెం ఎమ్మెల్యే  వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రపై పోలీసులు కేసు నమోదుచేశారు.

Police files case against Kothagudem MlAs Son Vanama Raghavendra
Author
Hyderabad, First Published Jan 3, 2022, 5:33 PM IST

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని  పాత palvancha పట్టణంలోని తూర్పు బజారులో ఒకే కుటుంబంలో ముగ్గరు Suicide పాల్పడిన ఘటనపై కొత్తగూడెం ఎమ్మెల్యే Vanama venkateswara raoతనయుడు Vanama Raghavendra పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాఘవేంద్ర కోసం గాలింపు చేపట్టినట్టుగా పోలీసులు చెప్పారు.

పాత పాల్వంచ తూర్పు బజారులో నివాసం ఉండే రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి దంపతులతో పాటు కవలలు సాహిత్య, సాహితిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.   ఈ ఘటనలో Ramakirishna  Srilaxmi , sahitya లు మరణించారు.

also read:Gas leake: పాల్వంచలో కూతురుతో పాటు తల్లిదండ్రులు సజీవ దహనం

ఈ ఘటనలో  80 శాతం కాలిన గాయాలతో ఉన్న sahiti ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ఈ లేఖలో తన చావుకు తన తల్లి, సోదరి తో పాటు ఎమ్మెల్యే తనయుడు వనమా రాఘవేంద్ర కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే   తనయుడు రాఘవేంద్ర వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టుగా రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్ర పరారీలో ఉన్నట్టుగా పోలీసులు చెప్పారు.  గతంలో ఓ కేసులో ముందస్తు బెయిల్ తో రాఘవేంద్ర బయటుకు వచ్చాడు. అయితే ప్రస్తుతం మరోసారి రామకృష్ణ  తన కుటుంబంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటనపై  రాఘవేంద్ర పై మరో కేసును నమోదు చేశారు  పోలీసులు.

పాల్వంచలో గతంలో రామకృష్ణ మీ సేవా కేంద్రం నిర్వహించేవారు.  రెండు నెలల క్రితం ఈ మీ సేవా కేంద్రాన్ని రామకృష్ణ అమ్మేశాడు.  ఆ తర్వాత ఆయన రాజమండ్రికి నివాసాన్ని మార్చాడు.  రెండు రోజుల క్రితం రామకృష్ణ, భార్య పిల్లలతో కలిసి పాల్వంచకు వచ్చాడు.  ఆదివారం నాడు రాత్రి కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించి ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో మరో చిన్నారి సాహితి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వ్యాపారాలు కలిసి రాకపోవడంతో పాటు ఆన్‌లైన్ వ్యాపారాల్లో రూ. 80 లక్షలకు పైగా నష్టం వచ్చినట్టుగా రామకృష్ణ సన్నిహితులు చెబుతున్నారు. 

అయితే రామకృష్ణ ఆత్మహత్య చేసుకొన్న ఇంటిని కూడా విక్రయించాలని భావించాడు. అయితే ఈ విషయమై తల్లి అడ్డు చెబుతుందని తెలిసింది. రామకృష్ణకు సోదరి కూడా ఉంది. ఆమెకు భర్త లేడు. దీంతో ఆస్తి విషయమై రామకృష్ణతో వివాదం ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయమై పెద్ద మనుషుల మధ్య పంచాయితీ నిర్వహించారని సమాచారం. అయితే రామకృష్ణ సూసైడ్ లేఖ ఆధారంగా పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios