జై మహా భారత్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే వైకుంఠం ట్రస్ట్ ద్వారా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ ఆ పార్టీ అధ్యక్షుడిగా వున్న భగవాన్ అనంత విష్ణు ప్రచారం చేస్తున్నాడు. దీనిపై ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అతనిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

పార్టీలో చేరిన వారికి ఇళ్లు, ఫ్లాట్లు ఇస్తానంటూ అమాయక ప్రజలకు వల విసురుతోన్న జై భారత్ పార్టీ నేత అనంత విష్ణు బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజల నుంచి ఆధార్ కార్డులు సేకరించడంపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాగా.. జై మహా భారత్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే వైకుంఠం ట్రస్ట్ ద్వారా ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానంటూ ఆ పార్టీ అధ్యక్షుడిగా వున్న భగవాన్ అనంత విష్ణు ప్రచారం చేస్తున్నాడు. దాదాపు ఐదు నెలలుగా ఈ తతంగం నడుస్తున్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతమందికి ఇళ్ల స్థలాలు అంటే మాటలు కావు, ప్రభుత్వాలే ఇవ్వలేవు. అలాంటిది ఈ భగవాన్ అనంత విష్ణు మాత్రం .. తాను మహా విష్ణువునని లక్ష్మీదేవి భర్తనని, పేదల కోసమే పార్టీ పెట్టానని చెప్పుకుంటున్నాడు. 

ALso REad:పార్టీలో చేరితే ఇళ్లు, ఫ్లాట్లు .. అమాయకులకు జై భారత్ పార్టీ పేరుతో వల, క్యూకట్టిన మహిళలు

తన పార్టీ సభ్యత్వం తీసుకుంటే వైకుంఠం ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి 200 వందల గజాల స్థలం ఇప్పిస్తానని విష్ణు ప్రచారం చేశాడు. దీని కోసం రెండు ఫోటోలు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ని వసూలు చేశాడు. ఐదు నెలలుగా సభ్యత్వాలు కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో గడువు ముగుస్తుందని ప్రచారం జరగడంతో లక్డీకపూల్ లోని పార్టీ ఆఫీసు ముందు మహిళలు భారీగా క్యూకట్టారు. దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు..స్పాట్ కి చేరుకుని విచారించగా ఈ బాగోతం బయటపడింది. సభ్యత్వాలపై ఆరా తీసిన పోలీసులు... బాధితులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

కాగా.. జోగులాంబ గద్వాల్ జిల్లా బుక్కాపురం గ్రామానికి చెందిన అనంత విష్ణు పాలిటెక్నిక్ పూర్తి చేశాడు. ఎల్ఎల్‌బీ చదివి కొంతకాలం పాటు లా ప్రాక్టీస్ చేశాడు. 2008లో జై మహా భారత్ పార్టీని స్థాపించాడు. 2014లో ఎన్నికల్లో అభ్యర్ధులను నిలబెట్టాడు. లక్డీకపూల్ రవీంద్ర భారతి వద్ద పార్టీ కార్యాలయాన్ని నెలకొల్పాడు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెంబర్‌షిప్ డ్రైవ్ చేస్తున్నాడు. ఈ సభ్యత్వాలు కూడా 18 ఏళ్లు నిండిన మహిళలకు మాత్రమేనని కండీషన్ పెట్టాడు.