అమ్నేషియా పబ్ అత్యాచార కేసు బాధితురాలి వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై పోలీసులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు నలుగురిపై కేసు నమోదు చేశారు. 

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ అత్యాచారం కేసు (amnesia pub rape case) విచారణలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీనిలో భాగంగా బాలికతో నిందితులు అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో తీసిన వీడియోలు, ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియోలు వైరల్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరించారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను అరెస్ట్ చేస్తామని స్పష్టం చేశారు. 

మరోవైపు అత్యాచారం కేసులో పోలీసుల విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అత్యాచారమే కాకుండా నిందితులు బాలికపై విచక్షణారహితంగా దాడి చేసినట్లుగా ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఈ క్రమంలోనే బాలిక మెడపై తీవ్రగాయాలు చేశారు నిందితులు. అలాగే బాలిక శరీరంపైనా గాయాలను గుర్తించారు తల్లిదండ్రులు. ఇన్నోవా కారులో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాలిక ప్రతిఘటించడంతో గోళ్లతో దాడి చేశారు నిందితులు. ఈ నేపథ్యంలో బాలిక ఒంటిపై 12 గాయాలను గుర్తించారు వైద్యులు. 

Also Read:amnesia pub case: గోళ్లతో రక్కుతూ .. బాలికకు నరకం చూపిన నిందితులు, పోలీసుల విచారణలో వెలుగులోకి

కాగా..కేసులో ఏ-1గా ఉన్న Saduddin Malikను చంచల్గూడ జైలు నుంచి Police custodyలోకి తీసుకున్నారు. కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారించాల్సి ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని పోలీసులు గతంలో కోరిన సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి ఈనెల 12వ తేదీ వరకు కస్టడీకి కోర్టు అనుమతించింది. సాదుద్దీన్ మాలిక్ ను ప్రశ్నిస్తే మరికొన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అత్యాచార ఘటనను Sean Reconstruction చేయనున్నారు. పబ్లో బాలికను డ్రాప్ చేసిన అంశాల పైనా విచారించారు.

ఇకపోతే.. సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితులు ఉపయోగించిన.. Innova car విషయంలో స్పష్టత రాలేదు. దీని యాజమానులు ఎవరు? రిజిస్ట్రేషన్ స్థితిపై స్పష్టత లేకపోవడం అంశాలు.. రాష్ట్రవ్యాప్తంగా తాత్కాలిక Registration నంబర్లతో తిరుగుతున్న వాహనాలు, రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న వాహనాలు.. రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా అనేక వాహనాలు తిరుగుతున్నాయన్న విషయం వెలుగులోకి వచ్చింది.

దక్కన్ క్రానికల్ కథనం ప్రకారం.. మే 28 నేరంలో ఉపయోగించిన ఇన్నోవా కారును సెప్టెంబర్ 2019లో కొనుగోలు చేశారు. కానీ కొనుగోలుదారు కొన్నవారిపేరు మీద వాహనాన్ని రిజిస్టర్ చేయలేదు. ఈ వాహనాన్ని, ప్రభుత్వరంగ సంస్థలో పనిచేస్తున్న మైనారిటీ కమ్యూనిటీకి చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ మరియు రిజిస్ట్రీ నిబంధనల అమలును నియంత్రించే తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) అధికారి ఒకరు మాట్లాడుతూ, తెలంగాణ రోడ్లపై వేల సంఖ్యలో రిజిస్ట్రేషన్ లేని వాహనాలు తిరుగుతున్నాయని, ఒక్కోసారి ఇలా రిజిస్ట్రేషన్ లేకుండా సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు కూడా తిరుగుతున్న దాఖలాలు ఉన్నాయని, ఇంకొన్ని కేసుల్లో అయితే ఇంకా ఎక్కువ కాలం కూడా రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్నాయని తెలిపారు.