పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుపై ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేశారు. యూనిఫాం సర్వీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు 


తెలంగాణ సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో పాటు ఆ పార్టీ నేత భాగం హేమంతరావుపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న వరంగల్ క్రాస్ రోడ్స్‌లో సీపీఐ నిర్వహించిన ర్యాలీలో .. ఖమ్మం రూరల్ సీఐపై ఆరోపణలు చేశారు కూనంనేని. దీంతో బెదిరింపులు, తిట్టడం.. యూనిఫాం సర్వీసులపై ఇష్టానుసారంగా మాట్లాడటం, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు 

ALso REad:పల్లా వెనక్కి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు

అంతకుముందు తెలంగాణ గవర్నర్ తమిళిసై పై కూనంనేని సాంబశివరావు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఎంతలో వుండాలో, అంతలోనే వుండాలన్నారు. ఇది విమోచనమో, విలీనమో గవర్నర్‌కు ఎందుకని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు. గవర్నర్ తనకు మించిన పనులు చేస్తోందని , గవర్నర్ వ్యవస్థ ప్రజలకు అస్సలు పనికి రాదన్నారు . సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా డిక్లేర్ చేయాలని కూనంనేని డిమాండ్ చేశారు.