వాహనాల నెంబర్ ప్లేట్లపై నోటికి వచ్చినట్లు రాతలు రాయడం ఈ మధ్యకాలంలో చాలా మంది యువకులకు ఫ్యాషన్ గా మారింది. ఇలా రాసుకొనే.. ఓ యువకుడు పోలీసులు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లిబర్టీ సర్కిల్ వద్ద చోటుచేసుకుంది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. నారాయణగూడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ చంద్రమోహన్.. వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా... ఓ యువకుడు వేగంగా దూసుకువచ్చాడు. అది కొత్త బండి. రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఇంకా రాలేదు. నంబర్ ప్లేట్‌పై మాత్రం ‘‘ ఆగు బే’’ అని ఇంగ్లీష్ లో అభ్యంతరకర రీతిలో పదాలను రాశాడు. ఇదేంటని యువకుడిని పోలీసులు ప్రశ్నించగా.. ఫ్యాషన్‌గా ఉంటుందని రాయించుకున్నా అని చెప్పాడు. దీంతో  అవాక్కవ్వడం పోలీసుల వంతు అయ్యింది.

అనంతరం పోలీసులు  నంబర్ ప్లేట్, లైసెన్స్ లేకపోవడం వంటి కారణాలు చూపి యువకుడిపై కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం వాహనం స్వాధీనం చేసుకున్నారు.