ఈ విషయం మనసులో పెట్టుకున్న చిన్న కోడలు బేబి ఆదివారం ఉదయం శాంతమ్మ ఇంటికి వచ్చి ఘర్షణ పడింది. ఆ సమయంలో ఆమె చేతిలో బిందె ఉండటంతో దాంతోనే శాంతమ్మ తలపై కొట్టింది. 

ఒకప్పుడు ఇంటికి వచ్చిన కోడలిని అత్త నానా రకాలు హింసలు పెట్టేది. ఇప్పుడు కాలం మారింది. కోడళ్లే.. అత్తలను హింసిస్తున్నారు. ఇలాంటి సంఘటణే ఒకటి హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కోడలు చీటికిమాటికి కొడుతోందని ఓ అత్త బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిలింనగర్‌ మహాత్మాగాంధీనగర్‌లో నివసించే శాంతమ్మ(70) గతంలో ప్రభుత్వ వసతి గృహంలో వంటమనిషిగా పనిచేసేవారు. తనకు వచ్చే పింఛనుతో పెద్దకుమారుడితో కలిసి ఉంటోంది. కాగా ఆమెకొచ్చే పింఛనును పెద్దకుమారుడి కుటుంబానికే ఇస్తోంది. 

ఈ విషయం మనసులో పెట్టుకున్న చిన్న కోడలు బేబి ఆదివారం ఉదయం శాంతమ్మ ఇంటికి వచ్చి ఘర్షణ పడింది. ఆ సమయంలో ఆమె చేతిలో బిందె ఉండటంతో దాంతోనే శాంతమ్మ తలపై కొట్టింది. శాంతమ్మ నేరుగా బంజారాహిల్స్‌ ఠాణాకు వెళ్లి కోడలిపై ఫిర్యాదు చేసింది. ఇలా కొట్టడం ఇదేమి తొలిసారి కాదని ఆమె పేర్కొంది. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు.