షామీర్ పేటలో శుక్రవారం అర్థరాత్రి అశ్లీల నృత్య ప్రదర్శనలో కొందరు డాక్టర్లు, అమ్మాయిలు పట్టుబడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీ వెనుక భారీ కుంభకోణం దాగివున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ రేవ్ పార్టీ వెనుక ఓ బడా పార్మా కంపనీ హస్తం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఫార్మా కంపనీలు తయారు చేసే ఔషదాలను విక్రయించాలంటే హాస్పిటల్స్, మెడికల్ షాప్స్, డాక్టర్లపై ఆదారపడాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలతో భాదపడే వారు డాక్టర్లు సూచించే మందులను వాడుతుంటారు. దీంతో తమ ఔషదాల అమ్మకాలకు సహకరించే డాక్టర్లకు కొన్ని కంపనీలు బహుమతులు ఇస్తుంటాయి. 

అయితే షామీర్ పేటలో రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన కంపనీ మాత్రం మరింత దారుణంగా ఆలోచించింది. తమ వ్యాపారాన్ని పెంచుకోడానికి ఇలా పార్టీ పేరుతో డాక్టర్లకు అమ్మాయిలను ఎర వేసింది. గజ్వేల్ ప్రాంతానికి చెందిన కొందరు డాక్టర్లకు రిసార్టుకు తీసుకువచ్చిన సదరు కంపనీ ప్రతినిధులే అమ్మాయిలను కూడా సప్లై చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఇలా ఔషద తయారీ కంపనీలు వ్యాపారం కోసం దిగజారి వ్యవహరించడంపై పోలీసులు సీరియస్ అవుతున్నారు. సదరు పార్మా కంపనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

హైదరాబాద్ శివారులో వైద్యుల రేవ్ పార్టీ...