శుక్రవారం అర్థరాత్రి మేడ్చల్ జిల్లాలోని ఓ రిసార్టులో అశ్లీలం తాండవించింది. కొందరు హైప్రొపైల్ డాక్టర్లు మద్యం మత్తులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డారు. మందు, మగువ మత్తులో భారీ రేవ్ పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 

హైదరాబాద్ శివారులోని శామీర్ పేట ఈ అసాంఘిక కార్యక్రమానికి అడ్డాగా మారింది. ఈ ప్రాంతంలోని సెలబ్రిటీ రిసార్టులో పార్టీని ఏర్పాటు చేసుకున్న వైద్యులు కొందరు అమ్మాయిలను రప్పించుకుని అశ్లీల నృత్యాలకు, కార్యక్రమాలను సిద్దపడ్డారు. అయితే  పార్టీపై పక్కా  సమాచారం అందుకున్న పోలీసులు రిసార్టుపై దాడిచేసి అశ్లీల కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

ఈ దాడిలో ఏడుగురు డాక్టర్లను, నలుగురు అమ్మాయిలు పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే భారీగా మద్యం, కండోమ్ పాకెట్లతో పాటు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించడానికి వాడే
మెడికల్ కిట్లు కూడా లభ్యమయ్యాయి. పట్టుబడిన డాక్టర్లంతా గజ్వెల్ ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.