తెలంగాణ సెక్రటేరియట్ ముట్టడికి కానిస్టేబుల్ అభ్యర్థుల యత్నం, అరెస్ట్: కేసు నమోదు

తెలంగాణ సచివాలయం వద్ద ఆందోళనకు యత్నించిన  కానిస్టేబుల్ అభ్యర్థులపై  పోలీసులు  కేసు నమోదు  చేశారు.

 Police constable post aspirants stage protest at Telangana Secretariat lns

 

హైదరాబాద్:జీవో నెంబర్  46ను రద్దు చేయాలని  కోరుతూ  బుధవారంనాడు  హైద్రాబాద్ సెక్రటేరియట్ ను  ముట్టడించేందుకు  యత్నించిన  కానిస్టేబుల్ అభ్యర్థులను  పోలీసులు అరెస్ట్  చేశారు. పాత పద్దతిలోనే  కానిస్టేబుల్ నియామకాలు  చేపట్టాలని  కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్  చేస్తున్నారు.  

జీవో నెంబర్  46ను  రద్దు చేయాలని కోరుతూ కానిస్టేబుల్ అభ్యర్థులు  మంగళవారంనాడు డీజీపీ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు.   ఇవాళ  సెక్రటేరియట్  ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో సెక్రటేరియట్ వద్ద భారీగా  పోలీసులను మోహరించారు.  సెక్రటేరియట్ ముట్టడికి  యత్నించిన   కానిస్టేబుల్ అభ్యర్థులను  పోలీసులు అరెస్ట్  చేశారు.  సచివాలయం వద్ద  ఆందోళనకు యత్నించిన కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదు  చేశారు.మెరిట్ ప్రాతిపదికనే  కానిస్టేబుల్  నియామకాలు చేపట్టాలని వారు  డిమాండ్  చేశారు.

అగ్నిమాపక శాఖలో, జైళ్ల శాఖలో  కానిస్టేబుల్  పోస్టుల గరిష్ట వయో పరిమితిని  35 ఏళ్ల నుండి 30 ఏళ్లకు తగ్గించడంపై  కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం  చేస్తున్నారు.అంతేకాదు  2000లో  కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ను  2022 ఇచ్చారని  ఆందోళన వ్యక్తం  చేశారు.

గతంలో  కానిస్టేబుల్ నియామకాలు చేపట్టినట్టే  ఈ దఫా కూడ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆందోళన కారులు డిమాండ్  చేస్తున్నారు. జీవో  46 ప్రకారంగా జనాభా ప్రాతిపదికన  పోస్టులు భర్తీ చేస్తున్నారని కానిస్టేబుల్ అభ్యర్థులు చెబుతున్నారు.  దీంతో రాచకొండ, 
 సైబరాబాద్, హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిల్లో  53 శాతం పోస్టులు మాత్రమే భర్తీ అవుతున్నాయని  వారు ఆవేదన చెందుతున్నారు.జీవో 46  వల్ల జిల్లాలకు  కటాఫ్ పోస్టులు పెట్టడంతో తమకు  ఉద్యోగాలు దక్కని పరిస్థితి నెలకొందని వారు  ఆవేదన చెందారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios