భద్రాచలం: మంచి ఉద్యోగం...ఏ లోటూ లేకుండా ఆనందంగా సాగుతున్న సంసారం... ముచ్చటైన పిల్లలు... ఇలా ఆనందంగా సాగుతున్న జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు ఓ సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్. భార్యా బిడ్డలను కాదని వేరే మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ తాజాగా ఓ లాడ్జీలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. 

వివరాల్లోకి వెళితే....భద్రాచలం జిల్లా చర్ల మండలం అలుబాక సీఆర్‌పిఎఫ్ బెటాలియన్ లో సుభాష్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం మణుగూరుకు చెందిన సౌజన్యతో వివాహం కాగా ఇద్దరు పిల్లలున్నారు. ఇలా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలోకి మరో మహిళ ప్రవేశించింది. 

సదరు కానిస్టేబుల్ వేరే మహిళతో గత ఏడాదిగా వివాహేతర సంబంధాన్ని సాగిస్తూ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. సరిగ్గా ఇంటికి రాకపోవడం, భార్యా బిడ్డల ఆలన పాలనను మరిచి ప్రియురాలితోనే సహజీవనం చేస్తున్నాడు. అతడి వ్యవహారశైలితో విసిగిపోయిన భార్య తాజాగా అతడు ఓ లాడ్జీలో మహిళతో కలిసివుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. దీంతో భార్యాభర్తలతో పాటు సదరు మహిళకు కూడా కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు.